Begin typing your search above and press return to search.
తెలుగు మగధీర కూడా కాపీయేనా?
By: Tupaki Desk | 2 Jun 2017 4:13 AM GMTమగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టేసి.. బాలీవుడ్ మూవీ 'రాబ్తా'ను తెరకెక్కించారంటూ.. గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు దాఖలు చేయడం సెన్సేషన్ అయింది. ట్రైలర్ రిలీజ్ నుంచి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరకు కాపీ అనే అనుమానాలు వెల్లువెత్తగా.. ఇప్పుడీ వివాదం కోర్టుకు చేరింది.
అయితే.. తెలుగు మగధీర చిత్ర కథ కూడా కాపీనే అంటూ ఇప్పుడో కొత్త వివాదం మొదలైంది. 1998లో తాను రాసిన 'చందేరి' అనే నవలను కాపీ కొట్టి.. మగధీర చిత్రాన్ని తీశారని ఆరోపిస్తున్నారు నవలా రచయిత ఎస్ పి చారి. హరదాల్ పేరును హర్ష అని.. ఇందుమతిని ఇందు అని పేర్లు మార్చారని అంటున్నారు. '400 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మళ్లీ 400 ఏళ్ల తర్వాత తిరిగి జన్మించి పెళ్లి చేసుకుంటారన్నది చందేరి కథ. నవలలో మెయిన్ విలన్ కేరక్టర్ హీరోకి సోదరుడు అయితే.. సినిమాలో మాత్రం హీరోయిన్ కి బావగా చూపించారు. మిగతా కథంతా ఒకటే' అని రచయిత ఆరోపిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ కు వ్యతిరేకంగా ఫిలిం ఛాంబర్ లో కేసు నమోదు చేసినా ఎవరూ పట్టించుకోలేదట. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మగధీరకు కథా రచయిత అనే సంగతి తెలిసిందే. కాపీ రైట్ యాక్ట్ ప్రకారం మగధీరపై ఈ రచయిత కోర్టుకు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/