Begin typing your search above and press return to search.
క్షణం హీరో అంత అనుమానపడ్డాడా!!
By: Tupaki Desk | 4 Jun 2017 10:31 AM GMTసినిమాలో కథాబలం ఉంటే.. అ కథే ఓస్టార్ ని తయారుచేస్తుందని చెప్పడానికి మంచి ఉదాహరణ ‘క్షణం’. క్షణం కంటే ముందు పంజాతో పాటు పలు మూవీస్ చేశాడు. తానే డైరెక్ట్ చేసి హీరోగా నటించినా విజయం దక్కలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన క్షణం, బాహుబలి వచ్చి అడివి శేష్ కి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు మరో సారి తన కామిడీతో ‘అమీ తుమీ’ అంటూ.. జూన్ 9న వస్తున్నాడు ఈ హీరో.
“నేను ఇంతవరకు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటిగారు ఇచ్చిన సహకారంతోనే ఈ పాత్ర చేయగలిగాను. నేను ఎలా చేశానో ప్రేక్షకులే చెప్పాలి. నేను, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి గారు దర్శకులం కావడంతో కథను బాగా అర్ధం చేసుకొని ఇంద్రగంటిగారి విజన్ కు సరిపడినట్లుగా కలిసి పని చేశాం” అన్నాడు అడివి శేష్. మళ్లీ దర్శకత్వం వహించే ఆలోచన తనకు ఉందని కూడా అన్నాడు. తన దగ్గర 40 కథలు ఉన్నాయి కానీ.. వాటిలో ఎన్ని సినిమాకు పనికి వస్తాయో తెలియదట.
జూన్ 9న 'అమీ తుమీ' విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ళ భరణి మరో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మణి శర్మ స్వరపరిచారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/