Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అవంతిక.. ది కిచిడీ!!
By: Tupaki Desk | 19 Dec 2016 4:13 PM GMTఅవును లాంటి హారర్ మూవీస్ తో మెప్పించిన పూర్ణ.. యాక్టింగ్ విషయంలో మంచి ట్యాలెంటెడ్ నటి. ఇప్పుడు పూర్ణ ప్రధాన పాత్రలో ఓ హారర్ కామెడీ మూవీ 'అవంతిక' విడుదల కాబోతోంది. రీసెంట్ గా అవంతిక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
'త్రేతాయుగంలో బలులు ఇవ్వడం ఆచారం. ఇప్పటికీ జంతుబలులు చూస్తూనే ఉన్నాం. కానీ మనిషి మూఢ నమ్మకాన్ని బేస్ చేసుకుని ఇప్పటికీ మోసాలు చేసేవారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు' అంటూ వాయిస్ఓవర్ తో మొదలుపెట్టి.. ఆ తర్వాత అసలు విషయంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీరాజ్. కాసేపు జబర్దస్త్ టీంతో కామెడీ నడిపించిన తర్వాత.. అసలు స్టోరీలోకి మళ్లింది ట్రైలర్. హీరోయిన్ పూర్ణ మొదట ఎంతో అందంగా.. అంతకు మించి ఆకర్షణీయంగా కనిపించింది. తాను ఈ పూజకు సిద్దమే అంటూ నరబలికి యాక్సెప్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నరబలికి బోలెడన్ని శక్తులు వచ్చేస్తాయనే నమ్మకాల చుట్టూ రాసుకున్న కథ ఇది. తీరా బలిచ్చేటపుడు అసలు రూపం చూపించడం లాంటి థీమ్ తో ట్రైలర్ ఫినిష్ చేశారు. కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని అర్ధమయేట్లు చెప్పడానికి విజువల్స్ కంటే వాయిస్ పై ఎక్కువగా బేస్ కావడం కనిపిస్తుంది. పైగా సినిమా అంతా కూడా కాస్త అరుంధతి.. కాస్త చంద్రముఖి.. కాస్త లారెన్స్ మాష్టారి హారర్ ఎఫెక్టు కూడా ఫుల్లుగా నింపేశారేమో అని ట్రైలర్ చూస్తే సందేహం రావడం ఖాయం. అన్ని హారర్ సినిమాల తాలూకు కిచిడీగా అవంతిక నిలిచిపోతుందేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/