Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ కూతురుతో బెల్లంకొండ బాబు రొమాన్స్‌

By:  Tupaki Desk   |   12 Nov 2021 6:51 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ కూతురుతో బెల్లంకొండ బాబు రొమాన్స్‌
X
ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పెద్దబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇప్పటికే గుర్తింపు దక్కించుకుని కమర్షియల్‌ సక్సెస్ ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో బెల్లంకొండ బాబు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. బెల్లంకొండ సురేష్‌ చిన్నబ్బాయి బెల్లంకొండ గణేష్‌ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇప్పటికే ఈ చిన్నబ్బాయి హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా వరుస వేవ్స్ వల్ల డెబ్యూ ఆలస్యం అవుతోంది. గణేష్ బాబు హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందించేందుకు ప్రీ ప్రొడోన్‌ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

గణేష్‌ మరియు సతీష్‌ వేగేశ్నల కాంబో సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అవంతిక దాసాని ని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. అవంతిక తెలుగులో చేయబోతున్న మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సీనియర్‌ హీరోయిన్ కమ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన భాగ్యశ్రీ కూతురు అవంతిక. ఇప్పటికే బాలీవుడ్ లో అవంతిక కు మంచి గుర్తింపు దక్కింది.

సోషల్ మీడియా ద్వారా అవంతిక సుపరిచితురాలు. అలాంటి అవంతికను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు బెల్లంకొండ అండ్ టీమ్‌ ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. బెల్లంకొండ మరియు అవంతికల కాంబో లో ఇప్పటికే ఫొటో షూట్ మరియు టెస్ట్‌ షూట్‌ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే బెల్లంకొండ గణేష్‌ బాబు హీరోగా స్వాతిముత్యం అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో చినబాబు లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయంలో మరో సినిమాను సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవ్వడం జరిగింది.

ఆ సినిమాలో భాగ్యశ్రీ కూతురు అవంతికను హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. భాగ్య శ్రీ ఇప్పటికి కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్‌ సినిమాలో నటించారు. ప్రభాస్ కు తల్లి పాత్రలో భాగ్య శ్రీ రాధే శ్యామ్‌ లో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలీవుడ్‌ లో కడూఆ భాగ్య శ్రీ సినిమాలను చేస్తూ ఉన్నారు. మరో వైపు అవంతిక కూడా యాక్టింగ్‌ వర్క్ షాప్ లకు వెళ్తూ ఉందట.