Begin typing your search above and press return to search.
జ్యో అచ్యుతానంద అంత పెద్ద సినిమానా?
By: Tupaki Desk | 22 Sep 2016 7:30 PM GMTస్క్రిప్టు రాసుకున్నపుడు అంతా బాగానే ఉంది.. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి సినిమా ఆడదేమో అని భయమేసింది అంటూ ‘జ్యో అచ్యుతానంద’ సక్సెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇంతకీ తనకు అలాంటి సందేహాలు ఎందుకు కలిగాయో.. ఈ సినిమా ప్రివ్యూ చూసిన కొందరు ఏమన్నారో.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎలాంటి మార్పులు జరిగాయో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అవసరాల.
‘‘కథ రాసినపుడు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాను. ఐతే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి భయమేసింది. సినిమా విడుదలయ్యే వరకు చాలా టెన్షన్ అనుభవించాను. సినిమా పూర్తయ్యాక కొందరికి చూపిస్తే నచ్చలేదన్నారు. అన్నదమ్ముల అనుబంధాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని.. వారి మధ్య బంధాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు లేవని అన్నారు. నేను ‘జ్యో అచ్యుతానంద’ను 2 గంటల 40 నిమిషాల సినిమాగా తీశాను.
ఐతే నిర్మాత సాయి కొర్రపాటి గారు అంత నిడివి వద్దన్నారు. ఆయన అభిప్రాయం మేరకే 2 గంటల 10 నిమిషాలకు నిడివి తగ్గించాను. ఇక్కడ నా జడ్జిమెంట్ మీద సందేహం కలగగానే అన్ని విషయాలోనూ అనుమానాలు కలిగాయి. సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా సంతోషం కలిగించింది. నా తప్పుల్ని మన్నించి సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు ఆలోచిస్తే ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం భిన్నంగా రాయాల్సిందేమో అనిపిస్తుంది’’ అని అవసరాల చెప్పాడు.