Begin typing your search above and press return to search.
జ్యో అచ్యుతానంద.. అక్కడ నానీనే ఎందుకంటే?
By: Tupaki Desk | 19 Sep 2016 9:30 AM GMT‘జ్యో అచ్యుతానంద’ క్లైమాక్స్ లో తళుక్కున మెరిశాడు నేచురల్ స్టార్ నాని. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా.. నాని క్యామియో బాగానే హైలైట్ అయింది. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే ఈ పాత్రను ముందు దర్శకుడు అవసరాల శ్రీనివాసే చేయాలనుకున్నాడట. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడట. అందుకు కారణమేంటో తనదైన శైలిలో భలే చమత్కారంగా చెప్పాడు అవసరాల. ‘‘రెండు గంటలు హీరోలిద్దరూ నానా అగచాట్లు పడినా వాళ్లకు దక్కనిది నాకు దక్కితే.. వాళ్లలో లేనిది ఏంటి.. వీడిలో ఉన్నది ఏంటి.. వీడు డైరెక్టర్ కాబట్టి ఎవ్వరికీ దక్కనిది వీడికి దక్కింది.. అని జనాలు అనుకుంటారు. ఆ చెడ్డపేరు నాకొద్దు. అందుకే స్టార్ అయిన నానిని ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నా’’ అని చెప్పాడు అవసరాల.
ఐతే రెజీనాకు జోడీగా నానీనే చూపించినప్పటికీ.. ఆ సన్నివేశంలో తన కోసం కూడా ఓ చిన్న పాత్ర సృష్టించుకున్నానని.. ఐతే ఎడిటింగ్ లో దాన్ని లేపేశానని అవసరాల తెలిపాడు. నాని కనిపించే సన్నివేశాన్ని డైరెక్ట్ చేసింది తాను కాదని.. తన గురువు మోహన్ అని అతను వెల్లడించాడు. చాలామంది దర్శకులకు రెండో సినిమా ప్లాప్ అవుతుందని.. ఈ విషయంలో తాను చాలా లక్కీ అని అవసరాల చెప్పాడు. ‘‘తొలి సినిమా హిట్ అయితే రెండో సినిమాపై ఒత్తిడి ఉంటుంది. నాకా ఒత్తిడి లేదు ఎందుకంటే నా నిర్మాత నాపై ఉంచిన నమ్మకం. ఎంత సమయం కావాలన్నా తీసుకోమని ఆయన భరోసా ఇచ్చారు’’ అని చెప్పాడు.