Begin typing your search above and press return to search.
అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో వైరల్.. ఇండస్ట్రీలో ఉండవంటూ కోడైరెక్టర్ కి వార్నింగ్..!
By: Tupaki Desk | 24 March 2021 11:27 AM GMTహాస్యనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలెంటెడ్ నటుడు అవసరాల శ్రీనివాస్. 'అష్టా చమ్మా' సినిమాతో నటుడిగా.. 'ఊహలు గుస గుసలాడే' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అతని వద్ద గత మూడేళ్లుగా పనిచేస్తున్న కో డైరెక్టర్ ని శ్రీనివాస్ తిట్టి తన ఆఫీస్‌ని నుంచి బయటకు గెంటేయడంతో.. కో డైరెక్టర్ ఈ వీడియోని బయటపెట్టినట్లు తెలుస్తోంది.
సెల్ఫీ వీడియోలో కో డైరెక్టర్ మాట్లాడుతూ 'ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి నన్ను బయటకు పంపించేశాడు. ఒక్కటంటే ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి' అంటూ ఆఫీస్ దగ్గరకు వెళ్లి.. అవసరాల రియల్ ఫేస్ ను వీడియోలో చూసేలా చేసాడు. కో డైరెక్టర్ అవసరాల క్యాప్ ని బలవంతంగా తీయడంతో ఎప్పుడూ ఒత్తైన జుట్టుతో చక్కగా కనిపించే అవసరాల పూర్తి బట్టతలతో కనిపించి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ అవసరాల ఆ కో డైరెక్టర్ ని బెదిరిస్తూ కనిపించారు. యూట్యూబ్ ఇన్ స్టాగ్రామ్ అన్నింటిలోనూ పెట్టేస్తా అని కోడైరెక్టర్ అంటుండగా.. అతన్ని ఆపండయ్యా అని అవసరాల శ్రీనివాస్ గట్టిగా అరుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇదంతా మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే చేసారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల - చి.ల.సౌ ఫేమ్ రుహనీ శర్మ జంటగా నటిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈఈ వీడియోలో వాళ్ళ పెర్ఫామెన్స్ చూస్తుంటే ప్రమోషన్స్ కోసమే అనిపిస్తుంది. 'నూటొక్క జిల్లాల అందగాడు' చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు - డైరెక్టర్ క్రిష్ నిర్మిస్తున్నారు.
br>