Begin typing your search above and press return to search.
జ్యో అచ్యుతానంద.. అవసరాల లాగించేశాడు
By: Tupaki Desk | 17 July 2016 11:30 AM GMTకమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకుడవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. సైలెంటుగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసేశాడు. సర్ ప్రైజ్ హిట్టు కొట్టేశాడు. తొలి సినిమా హిట్టవడంతో దర్శకుడిగా మంచి అవకాశాలు వచ్చినా.. రెండో సినిమా విషయంలో ఏం తొందర పడలేదు. బాగా గ్యాప్ తీసుకుని.. మళ్లీ తన తొలి సినిమా నిర్మాత సాయి కొర్రపాటికే సినిమా కమిటయ్యాడు. అదే.. జ్యో అచ్యుతానంద.
ఆసక్తికర కాంబినేషన్ లో కొన్ని నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. టాకీ పార్ట్ కంప్లీట్ చేసి.. రెండు పాటలు మినహా పనంతా పూర్తి చేసేశాడు అవసరాల. తొలి సినిమా తరహలోనే మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అందిస్తున్నాడట శ్రీనివాస్. సినిమాలో మంచి ఫీల్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగిపోయిందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
జ్యోత్స్న అనే అమ్మాయి.. అచ్యుత్-ఆనంద్ అనే అబ్బాయిల మధ్య సాగే స్టోరీ ఇది. ఇందులో జ్యోతిగా రెజీనా కసాండ్రా నటిస్తుంటే.. అబ్బాయిల పాత్రల్ని నారా రోహిత్-నాగశౌర్య పోషిస్తున్నారు. ‘జ్యో అచ్యుతానంద’ అనే టైటిళ్లో ఉన్న మర్మం అదన్నమాట. తక్కువ బడ్జెట్లో.. తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేశాడట అవసరాల. ‘ఊహలు గుసగుసలాడే’కు మంచి మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణి కోడూరినే ఈ సినిమాకు కూడా సంగీతమందించాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. సెప్టెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.