Begin typing your search above and press return to search.
ఔను.. నాని ఆ సినిమాలో నటించాడు
By: Tupaki Desk | 6 Sep 2016 11:30 AM GMTనాని-అవసరాల శ్రీనివాస్ ఒకేసారి తెరంగేట్రం చేశారు. సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగానూ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘జ్యో అచ్యుతానంద’లో నాని ఓ క్యామియో రోల్ చేసినట్లుగా వార్తలొచ్చాయి ఈ మధ్య. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఇది రూమరేమో అని కూడా అనుకుంటున్నారు జనాలు. ఐతే ఇప్పుడు అవసరాల స్వయంగా తన సినిమాలో నాని ఓ పాత్ర చేసిన విషయం వాస్తవమే అని చెప్పాడు. ‘‘అవును .. నాని ‘జ్యో అచ్యుతానంద’లో స్పెషల్ రోల్ చేశాడు. ఇంతకుమించి ఆ రోల్ ఏంటి? ఎలా ఉంటుందీ? అనేది ఇప్పుడే చెప్పలేను. ఆ పాత్ర సర్ప్రైజ్ చేస్తుందన్నది మాత్రం వాస్తవం’’ అని అవసరాల చెప్పాడు.
అంతే కాక తన దర్శకత్వంలో నాని హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్లు కూడా అవసరాల వెల్లడించాడు. దర్శకుడిగా తన తొలి రెండు సినిమాలు నిర్మించిన వారాహి సంస్థలో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు కూడా అవసరాల చెప్పాడు. దర్శకుడిగా ఈ రెండు ప్రాజెక్టులు కమిటయ్యాని.. నటుడిగా తొలిసారి లీడ్ రోల్ చేయబోతున్న మాట వాస్తవమే అన్నాడు. ‘‘హంటర్ అనే ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ లో కథానాయకుడిగా నటిస్తున్నా. ఆ సినిమాలో ఎమోషన్ బాగా నచ్చడంతో.. అడల్ట్ కంటెంట్ అయినా ధైర్యంగా చేయాలని డిసైడయ్యాను’’ అన్నాడు అవసరాల. నటుడిగా.. దర్శకుడిగా ఒకేసారి కమిట్మెంట్లు ఇవ్వనని.. ఒకదానికి ఇంకోటి అడ్డు కాకుండా చూసుకుంటానని అవసరాల తెలిపాడు. ‘‘ఒకేసారి యాక్టింగ్.. డైరెక్షన్ రెండూ చేయను. దర్శకుడిగా పనిమొదలుపెడితే.. ఆ సినిమా పూర్తయ్యే వరకు నటన జోలికి వెళ్లను. ఈ విషయంలో మొదట్నుంచి పక్కా క్లారిటీతో ఉన్నా. ఒకదాంతో ఇంకోదానికి క్లాష్ రానివ్వను’’ అన్నాడు.