Begin typing your search above and press return to search.
కమెడియన్ యుద్ధం చేస్తే చెయ్యి విరిగింది
By: Tupaki Desk | 23 Oct 2015 6:13 AM GMTప్రేక్షకులు సినిమాల్లో యాక్షన్ - థ్రిల్లింగ్ సీన్స్ చూసి బాగానే ఎంజాయ్ చేస్తారు కానీ.. అవి అంతలా పండేందుకు యాక్టర్స్ బాగానే కష్టపడుతుంటారు. ఒకోసారి దెబ్బలు తిని చేతులు - కాళ్లు విరగ్గొట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కువగా హీరోలు, అప్పుడప్పుడూ హీరోయిన్లకు కూడా ఈ తిప్పలు తప్పవు. కానీ ఓ కమెడియన్ కూడా సినిమా షూటింగ్ కోసం చెయ్యి విరక్కొట్టుకోవడం చెప్పుకోదగ్గ విషయమే.
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తీసిన కంచెలో శ్రీనివాస్ అవసరాల దాసు అనే కామెడీ రోల్ పోషించాడు. హీరో అయిన ధూపాటి హరిబాబుకు కొలీగ్ కేరక్టర్ ఇది. మధ్యమధ్యలో సింగిల్ లైన్ పంచ్ లతో బాగానే నవ్వించాడు. అంతా కామెడీగా ఉన్నా.. చివర్లో యుద్ధంలో కూడా పాల్గొంటారు అవసరాల. కంచె కోసం జార్జియాలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇవి ఎంత అద్భుతంగా తెరెక్కించారంటే.. రెండో ప్రపంచ యుద్ధం కళ్లముందే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అంత డెప్త్ ఉండేలా సీన్స్ పిక్చరైజ్ చేయడానికి బాగానే రిస్క్ చేశారు యూనిట్.
యుద్ధం చిత్రీకరిస్తున్న సమయంలో ఈ కమెడియన్ కి బాగానే దెబ్బలు తగిలాయి. ఆరు చోట్ల ఎముకలు విరిగాయని, రెండు మెటల్ ప్లేట్స్ - 5 స్క్రూస్ వేయాల్సొచ్చిందని చెబ్తున్నాడు అవసరాల. అయితే.. కంచె మూవీకి మంచి నేమ్ రావడం, తన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండడంతో ఆ బాధ తెలీడం లేదని శ్రీనివాస్ అవసరాల చెబ్తున్నాడు. కమర్షియల్ గా హిట్ అయితే.. మరింత రిలీఫ్ అవుతారు యూనిట్.