Begin typing your search above and press return to search.
జ్యో అచ్యుతానంద.. ఎంత ఆహ్లాదమో
By: Tupaki Desk | 9 Aug 2016 5:12 AM GMTఅవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారుతున్నాడంటే చాలామంది లైట్ తీసుకున్నారు. కామెడీ వేషాలు వేసేవాడు.. ఏం సినిమా తీస్తాడులే అని తేలిగ్గా తీసి పడేశారు. కానీ అతనేమో ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ ఓ ఆహ్లాదకరమైన సినిమా తీసి ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా విజయం సాధించి అవసరాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఐతే ఆ ఊపులో రెండో సినిమా విషయంలో తొందరేమీ పడిపోలేదు అవసరాల. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ‘జ్యో అచ్యుతానంత’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నారా రోహిత్-నాగశౌర్య-రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది. ఈ మధ్యే టాకీ పార్ట్ కూడా పూర్తయింది.
త్వరలో ఆడియో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఈ సినిమా టైటిల్ లోగోను పరిచయం చేశాడు అవసరాల. అతడి తొలి సినిమా తరహాలోనే ఇది కూడా ఆహ్లాదంగా ఉండేలా కనిపిస్తోంది. టైటిల్ లోగో.. పోస్టర్ అంత అందంగా డిజైన్ చేయించాడు అవసరాల. త్వరలోనే ప్రధాన పాత్రధారుల లుక్స్ కూడా పరిచయం చేయబోతున్నారు. జ్యోత్స్న అనే అమ్మాయి.. అచ్యుత్-ఆనంద్ అనే అబ్బాయిల మధ్య సాగే స్టోరీ ఇది. ఇందులో జ్యోతిగా రెజీనా కసాండ్రా నటిస్తుంటే.. అబ్బాయిల పాత్రల్ని నారా రోహిత్-నాగశౌర్య పోషిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’కు మంచి మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణి కోడూరినే ఈ సినిమాకు కూడా సంగీతమందించాడు. సాయికొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.