Begin typing your search above and press return to search.

హీరోకు బూతు భయం పట్టుకుందట

By:  Tupaki Desk   |   7 April 2017 8:40 AM GMT
హీరోకు బూతు భయం పట్టుకుందట
X
టాలీవుడ్ లో కూడా చాలానే బూతు సినిమాలు వచ్చాయి. మరీ డైరెక్టుగా కాకపోయినా.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ సినిమా మొత్తం నింపేయడం అనే కల్చర్ ఉంది కానీ.. ఇలాంటి వాటిలో ఫ్రంట్ లైన్ యాక్టర్స్ ఎవరూ కనిపించరు. సెక్స్ బేస్డ్ సినిమాలైతే.. బీ గ్రేడ్.. సీ గ్రేడ్ యాక్టర్లతో తీసుకోవాల్సిందే తప్ప.. బాలీవుడ్ మాదిరిగా పేరున్న నటులెవరూ కనిపించలేదు.

కానీ మొదటిసారిగా ఈ ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ.. హంటర్ మూవీ తెలుగు రీమేక్ బాబు బాగా బిజీ మూవీలో నటించాడు యాక్టర్ కం డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల. ఇండస్ట్రీలో తనకు అనుభవం ఉన్న రెండు ఫీల్డ్ లలోనూ క్లీన్ ఇమేజ్ ఉన్న అవసరాల.. ఈ రీమేక్ లో నటించే ధైర్యం చేయడంతో.. ఇమేజ్ ఉన్న అమ్మాయిలనే తీసుకొచ్చే ఛాన్స్ వచ్చింది. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సీన్ మారిపోయింది. బూతు మూవీ అంటూ కామెంట్స్ మొదలవడంతో.. ఈ హీరో భయపడుతున్నాడట.

సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ లో డోస్ తగ్గించమంటూ దర్శకనిర్మాతలను కోరుతున్నాడట. అయితే.. ఆల్రెడీ బయర్స్ నుంచి అడ్వాన్సులు కూడా పుచ్చుకున్న నిర్మాతలు.. ఈ స్టేజ్ లో ఆ ధైర్యం చేయకపోవచ్చు. ప్రస్తుతానికి శ్రీనివాస్ అవసరాల కోరిక తీర్చగలిగేది ఒక్క సెన్సార్ డిపార్ట్ మెంట్ మాత్రమే. వాళ్లు ఎన్ని ఎక్కువ కట్స్ వేస్తే.. అంత సేఫ్ అన్నమాట. ఇప్పటికే బాబు బాగా బిజీని ఓ సారి సెన్సార్ కి పంపగా.. కట్స్ ఎక్కువ సూచించడంతో మళ్లీ రీ వర్క్ చేస్తున్నారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/