Begin typing your search above and press return to search.

అవసరాలకు తారల తాకిడి!!

By:  Tupaki Desk   |   5 July 2016 5:30 PM GMT
అవసరాలకు తారల తాకిడి!!
X
యాక్టర్ గానే కాకుండా.. దర్శకుడిగా కూడా శ్రీనివాస్ అవసరాల ఇప్పుడు మంచి బిజీ అయిపోతున్నాడు. సినిమాపై ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యాక్టర్ కం డైరెక్టర్.. ప్రస్తుతం నారా రోహిత్-నాగ శౌర్యలతో ఓ సినిమా చేస్తున్నాడు. జ్యో అచ్యుతానంద టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో క్రేజీ డైరెక్టర్ అవుతాడనే అంచనాలు ఉండడంతో.. అవసరాల షూటింగ్ స్పాట్ కు చాలామంది తారలు వచ్చి విషెస్ చెబుతున్నారు.

జ్యో అచ్యుతానంద షూటింగ్ సమయంలో సెట్స్ దగ్గరకు వచ్చిన సినీ తారల లిస్ట్ చాలానే ఉంటోంది. రీసెంట్ గా రాశి ఖన్నా షూటింగ్ స్పాట్ కు రాగా.. గతంలో మంచు మనోజ్.. నేచురల్ స్టార్ నాని లు కూడా వచ్చారు. ప్రతీ ఒక్కరూ అవసరాలతో కలిసి పడీపడీ నవ్వుతున్నారంటే.. ఈ సెట్స్ లో ఎంత కామెడీ హంగామా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఫన్ ని విపరీతంగా ఇష్టపడే దర్శకుడు.. కామెడీ టైమింగ్ లో సూపర్బ్ అనే కామెంట్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే సెట్స్ లో కూడా జోవియల్ గా ఉంటాడట శ్రీనివాస్ అవసరాల.

జ్యో అచ్యుతానంద మూవీలో రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా.. కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో తాను ఒక సినిమా చేస్తానని.. జెంటిల్మన్ ఆడియో రిలీజ్ సమయంలో నాని చెప్పిన విషయం గుర్తుందిగా!