Begin typing your search above and press return to search.

రొమాన్స్ లో ఆరితేరిపోతున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   10 Sep 2016 4:20 AM GMT
రొమాన్స్ లో ఆరితేరిపోతున్న డైరెక్టర్
X
రొమాన్స్ చేయడం సంగతేమో కానీ.. తీయడం మాత్రం అందరి వల్లా కాదు. ఇప్పుడు సినిమాల్లో.. ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్ వెంటపడ్డం వేధించడమే రొమాన్స్ అని ఫీలయిపోయే పరిస్థితి. దాదాపుగా డైరెక్టర్లంతా ఇదే రూట్లో ఉండగా.. యంగ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల మాత్రం కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధిస్తున్నాడు.

రొమాన్స్ ని పండించడం అంటే ఇద్దరి మధ్య భావాలను ఎక్స్ ప్రెషన్స్ తో చూపించే కల్చర్ ని మనోళ్లు మర్చిపోయి చాలాకాలం అయితే.. మళ్లీ బతికించేస్తున్నాడు అవసరాల. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే.. రీసెంట్ గా జ్యో అచ్యుతానంద చిత్రాలలో రొమాంటిక్ సన్నివేశాలను ఈ దర్శకుడు తెరకెక్కించిన తీరు చూసి.. అందరూ ప్రేమ తన్మయత్వంలో మునిగిపోయే పరిస్థితి. ఎక్స్ ప్రెషన్స్.. అతి తక్కువ డైలాగ్స్.. కళ్లతోనే చెప్పేసే ఫీలింగ్స్.. ఇలా హృద్యంగా రొమాన్స్ ను పండించే సీన్లతో అవసరాల మెప్పించేశాడు.

ఇప్పుడు రొమాంటిక్ సెక్స్ కామెడీ మూవీ హంటర్ రీమేక్ లో నటించేస్తున్నాడు కాబట్టి.. టాలీవుడ్ కి కొత్త రొమాంటిక్ ప్రిన్స్ గా శ్రీనివాస్ అవసరాలను చెప్పేసుకోవచ్చు. తనలో ఉన్న సూపర్ క్వాలిఫికేషన్ ని ఈ యాక్టర్ కం డైరెక్టర్ ఈ మధ్యనే బయటపెట్టాడు. యాక్ట్ చేసేటప్పుడు డైరెక్షన్.. దర్శకత్వం వహించేటపుడు యాక్టర్ గాను చేయనని చెప్పేశాడు శ్రీనివాస్ అవసరాల.