Begin typing your search above and press return to search.
అవసరాల అంత భయపడ్డాడా?
By: Tupaki Desk | 15 Sep 2016 7:30 PM GMTవిమర్శకులు.. ప్రేక్షకులు ముక్త కంఠంతో ‘జ్యో అచ్యుతానంద’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్షన్లకూ ఢోకా లేదు. ‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ చూడగానే రాజమౌళి ఇది సూపర్ హిట్ సినిమా అన్నాడు. నాని విడుదలకు ముందే ఈ సినిమా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఐతే దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కు మాత్రం తన సినిమా మీద నమ్మకం లేదట. స్క్రిప్టు దశలో కాన్ఫిడెంటుగానే ఉన్నప్పటికీ.. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం తనకు సినిమా ఆడదేమో అన్న సందేహం కలిగిందని అవసరాల అన్నాడు.
‘జ్యో అచ్యుతానంద’ సక్సెస్ మీట్లో భాగంగా అవసరాల మాట్లాడుతూ.. ‘‘జ్యో అచ్యుతానంద గురించి రివ్యూల్లో కానీ.. సోషల్ మీడియాలో కానీ వచ్చిన స్పందన చూస్తే చాలా సంతోషం కలిగింది. తృప్తిగా అనిపించింది. ఐతే నేను గత రెండు నెలల్లో చాలా ఒత్తిడికి గురయ్యాను. స్క్రిప్టు రాసుకున్నపుడు చాలా మంచి సినిమా చేయబోతున్నామని హ్యాపీగా ఉన్నా. కానీ సినిమా పూర్తి చేశాక ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సినిమా పోయిందన్న నమ్మకానికి వచ్చేశాను. ఇది జనాలు చుూస్తారా అన్న సందేహం కలిగింది. ఏదో తేడాగా అనిపించింది. అలాంటి టైంలో నిర్మాత సాయి గారు సపోర్టిచ్చారు. ఆయన ఎంతో ప్రెజర్లో ఉన్నపుడు వచ్చిన సినిమా ఇది. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. విడుదల తర్వాత సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూశాక హమ్మయ్య అనిపించింది. సినిమాలో ఏవైనా తప్పులున్నప్పటికీ మన్నించి జనాలు నెత్తిన పెట్టుకున్నారు. చాలా సంతోషం’’ అని అవసరాల చెప్పాడు.