Begin typing your search above and press return to search.
టీజర్ రెస్పాన్స్ అవసరాలను అలా బాధపెట్టిందట
By: Tupaki Desk | 6 Sep 2016 12:10 PM GMTదర్శకుడిగానూ - నటుడిగానూ మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కం యాక్టర్ అవసరాల శ్రీనివాస్. "ఊహలు గుసగుసలాడే" లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయయిన అవసరాల.. తన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా "జ్యో అచ్యుతానంద" సినిమాపై జనాలు పెట్టుకున్న - పెంచుకుంటున్న అంచనాలను చూస్తే మాత్రం బాధేస్తుందంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటం.. ఇదే సమయంలో టీజర్ - ట్రైలర్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆన్ లైన్ లో దూసుకుపోతున్న జ్యో అచ్యుతానంద సినిమా గురించి, ఇప్పటికే విడుదలయిన టీజర్ గురించి జనాలు మాట్లాడుకుంటున్న తీరు తనకు కొంచెం బాధ కలిగించిందని చెబుతున్నారు అవసరాల శ్రీనివాస్. ఇద్దరు అబ్బాయిలు - ఒక అమ్మాయి కనిపిస్తుంటే దీన్ని అందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నారని, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీకాదు కాదు.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇదసలు లవ్ స్టోరీయే కాదు.. అన్నదమ్ముల మధ్య సాగే ఒక భావోద్వేగభరిత ప్రయాణం మాత్రమే అని చెబుతున్నాడు దర్శకుడు అవసరాల. ఈ సినిమాలో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటుందని.. అదే కథను నడిపిస్తుందని.. ప్రేక్షకులు ట్రైలర్ చూసి వేరేగా ఆలోచించకుండా, ఇతర అంచనాలు చేసుకోకుండా ప్రిపేర్ చేయడానికే ఈ విషయం చెబుతున్నానని చెబుతున్నాడు శ్రీను.
ఇదే సమయంలో దర్శకుడు కావాలన్నది తన పదేళ్ల కల.. "అష్టాచెమ్మా" సినిమాకు తాను దర్శకత్వ విభాగంలో కూడా పని చేశానని, తాను పనిచేసిన చాలా సినిమాలకు సంబందించి దర్శకత్వ శాఖను పూర్తిగా అబ్జర్వ్ కూడా చేసేవాడినని చెప్పిన అవసరాల... తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన సాయి కొర్రపాటికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నాడు.