Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలకు ఎసరు పెట్టిన 'అవతార్‌ 2'

By:  Tupaki Desk   |   12 Dec 2022 5:37 AM GMT
సంక్రాంతి సినిమాలకు ఎసరు పెట్టిన అవతార్‌ 2
X
ఎన్నో నెలలుగా వెయిట్‌ చేస్తున్న అవతార్‌ : ది వే ఆఫ్‌ వాటర్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న అవతార్‌ 2 సినిమా బిజినెస్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జరిగింది. ఇండియాలో మాత్రం ఈ సినిమా డబ్బింగ్‌ రైట్స్ కు నిర్మాతలు కోట్‌ చేసిన మొత్తాన్ని ఇవ్వలేం అంటూ ఇక్కడి పెద్ద నిర్మాతలు కూడా చేతులు ఎత్తేయడంతో ఓన్ రిలీజ్ కు వెళ్లారు.

డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను ఆశ చూపించి అవతార్‌ 2 ను దేశ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఇప్పటికే పది కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. అవతార్ 2 యొక్క అడ్వాన్స్ బుకింగ్ చూస్తూ ఉంటే ఈ ఏడాదిలో వచ్చిన అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసేలా ఉందంటూ టాక్‌ వినిపిస్తుంది.

అవతార్ 2 సినిమా మేకర్స్ ఇక్కడి డిస్టిబ్యూటర్స్ కు దాదాపుగా 35 శాతం షేర్‌ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. అయితే సంక్రాంతికి మేజర్ థియేటర్స్ లో సినిమా ను ఆడించాలని కండీషన్ పెట్టారట. అలా మేజర్‌ థియేటర్స్ లో సినిమాను ఆడించేందుకు ఓకే చెప్పిన వారికి మాత్రమే సినిమా యొక్క పంపిణీ హక్కులను ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.

సంక్రాంతి సీజన్ మొదలు అవ్వడానికి ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఈ మూడు వారాల్లో అవతార్ 2 సాధ్యం అయినంత వసూళ్లు సాధిస్తుంది. సంక్రాంతి సీజన్ వరకు అవతార్ 2 వేడి పూర్తిగా చల్లారుతుందని అంతా భావిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సంక్రాంతి సీజన్ లో అవతార్‌ 2 ను అత్యధికంగా ప్రదర్శించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అవతార్ కోసం సంక్రాంతి సీజన్ కి గాను భారీ మొత్తంలో థియేటర్ లు ఇప్పటికే బ్లాక్ చేశారు అనేది టాక్‌. సినిమాకు పాజిటివ్‌ టాక్ వస్తే కచ్చితంగా నాలుగు వారాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే సంక్రాంతికి విడుదల కాబోతున్న మన తెలుగు సినిమాలకు కష్టాలు తప్పవేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.