Begin typing your search above and press return to search.
'అవతార్ -2' దెబ్బకి డిస్నీ షేర్లు ఢమాల్!
By: Tupaki Desk | 21 Dec 2022 7:30 AM GMT'అవతార్-2' దెబ్బకి డీస్నీ షేర్ల పతనం మొదలైందా? 'ది వే ఆఫ్ వాటర్' రిలీజ్ కి ముందే క్షీణ దశలో షేర్లు రిలీజ్ తర్వాత ఒక్కసారిగా పతనం పరాకాష్టకు చేరుతోందా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. 'అవతార్-2' నిర్మాణం సహా డిస్ర్టిబ్యూషన్ లో భాగమైన డీస్ని హాట్ స్టార్ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'అవతార్ -2' బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధ్యమేనా? అన్న నేపథ్యంలో మార్కెట్ లో డిస్నీ షేర్లపై ప్రభావం పడింది.
ఆ సంస్థ షేర్లు భారీగా పతనం అవ్వడమే ఇందుకు సూచిగా కనిపిస్తోంది. ఏకంగా 52 వారాల డౌన్ లెవల్‌కి 'డిస్నీ' షేర్లు పడిపోవడం గమనార్హం. వాస్తవానికి సినిమా రిలీజ్ కి ముందే డిస్నీ షేర్ల పతనం మొదలైంది.
తాజాగా రిలీజ్ తర్వాత ఏకంగా 'అవతార్-2' పుర్పార్మెన్స్ మీద బేస్ అవ్వడంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెట్టుబడి దారులంతా గుండె గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయి.
మరి ఈ ఫేజ్ నుంచి బయట పడటం అంత సులభం కాదు. వసూళ్లు అనుకూలంగా ఉంటే షేర్ల పరంగా ప్రతకూలత తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే భారీగా నష్టాలు తప్పవని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ మధ్య 'బ్రహ్మాస్త్ర' సినిమాకు డివైడ్ టాక్ రాగానే పీవీఆర్ సంస్థ షేర్లు ఒక్కసారిగా పడిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు భారీ ఓపెనింగ్స్ సాధించినా అటుపై ఒక్కసారిగా థియేటర్లు వెలవెలబోయాయి. దీంతో మార్కెట్లో షేర్ విలువ డౌన్ అయింది. ఇప్పుడు అవతార్ ది అదే పరిస్థితి.
అయితే అవతార్-2 వసూళ్లు పెరిగే అవకాశం ఉందని గెస్సింగ్స్ వినిపిస్తున్నాయి. భారత్ లో సినిమాకి ఆదరణ బాగానే ఉంది. పైగా వరల్డ్ వైడ్ క్రిస్మస్ హాలీడేస్ కూడా ఉన్నాయి. దీంతో ఈ పదిరోజులు సినిమాకి ఇండియా సహా పలు దేశాల్లో వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.