Begin typing your search above and press return to search.
అవతార్ 2.. అవసరాలకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
By: Tupaki Desk | 14 Dec 2022 2:30 AM GMTప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫాన్స్ అయితే ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 60 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఇండియాలో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తూ ఉండడం విశేషం.
ఇక తెలుగులో ప్రత్యేకంగా ఈ సినిమా 100 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే అవతార్ 2 సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన డైలాగ్స్ ను రాసే బాధ్యతను శ్రీనివాస్ అవసరాలకు ఇచ్చారు. అతను రచయితగా దర్శకుడుగానే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతోనే అతనిలోని రచన దర్శకత్వ ప్రతిభ అందరికీ అర్థమైంది.
అయితే అవతార్ సినిమాకు అతను డైలాగ్ వెర్షన్ రాయడానికి అవకాశం ఎలా అందుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవతార్ 2 సినిమాను 160 భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా డబ్బింగ్ వెర్షన్స్ కు సంబంధించిన పనులను చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసింది.
ఇక మొదట డిస్ట్రిబ్యూటర్స్ వారికి బాగా అనిపించే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారి బయోడేటాను అవుతార్ టీంకు పంపించాల్సి ఉంటుంది. ఇక అవతార్ టీం ఇంటర్వ్యూ చేసిన తర్వాతే ఎవరైనా సరే ఫైనల్ అవుతారు. డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టు కూడా వారు చెబితేనే ఫిక్స్ అవుతారు. ఇక శ్రీనివాస్ అవసరాల కూడా ప్రత్యేకంగా ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరై సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
అతను ఇదివరకే అమెరికాలో జాబ్ చేసిన అనుభవం ఉంది. అలాగే హాలీవుడ్ సినిమాల గురించి కూడా బాగా తెలుసు. ఇక తెలుగు లో అతను మంచి పట్టు సాధించిన రచయిత కూడా కాబట్టి అతను అయితేనే సెట్ అవుతారని టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అతనికి మంచి పారితోషికం ఇచ్చి డైలాగ్స్ రాయించినట్లు సమాచారం. అయితే అతని రైటింగ్ లో ఎక్కువగా కామెడీ సెన్స్ హైలైట్ గా ఉంటుంది. మరి ఇలాంటి అడ్వెంచర్ సినిమాలో శ్రీనివాస్ అవసరాల ఎలాంటి డైలాగ్స్ తో ఏ విధంగా అనువాదం చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.