Begin typing your search above and press return to search.
`అవతార్ 2` డాక్యుమెంటరీలా ఉందన్న యువనిర్మాత
By: Tupaki Desk | 16 Dec 2022 3:52 PM GMTమోస్ట్ అవైటెడ్ `అవతార్: ది వే ఆఫ్ వాటర్` ఈ రోజు (16 డిసెంబర్) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి ఘనమైన సమీక్షలను అందుకుంటోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలతో పాటు భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టి చిత్రీకరించారు. ప్రపంచం మొత్తం ఈ విజువల్ వండర్ పై ప్రశంసలు కురిపిస్తోంది.
అయితే అవతార్ 2 పై భీమ్లా నాయక్- డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన యువ టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం డాక్యుమెంటరీలా ఉందని వ్యాఖ్యానించడం అవతార్ ప్రేమికులకు నచ్చడం లేదు.
వంశీ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ``జేమ్స్ కామెరూన్ మనకు దిశానిర్ధేశనం చేస్తున్నారు. మెరైన్ బయాలజీ డాక్యుమెంటరీని చూడండి. అది 3D లో.. అతనిది కాబట్టి.. ఈ చిత్రం “విజువల్ స్పెక్టాకిల్”! ``మాస్టర్‌క్రాఫ్ట్`` .. ``బ్లాక్‌బస్టర్`` అని మాత్రమే చెప్పడానికి మనకు అనుమతి ఉంది. మరేదైనా Na'vi (నాగవంశీ) అంగీకరించడు`` అంటూ కొన్ని తమాషా ఈమోజీలను అతడు షేర్ చేసారు. నీటి అడుగున ఒక సరికొత్త ప్రపంచంపై డాక్యుమెంటరీలా తీసినా కానీ ఇది విజువల్ వండర్ అనే తన ఉద్ధేశాన్ని వంశీ తనదైన శైలిలో చెప్పారు.
అయితే చాలా మందికి నచ్చిన ఈ చిత్రంపై అతని వ్యాఖ్యలకు చాలా మంది నెటిజనుల నుండి ప్రతికూలత ఎదురవుతోంది. అయితే వంశీ దేనికీ ప్రతి స్పందించలేదు. అలాగని ట్వీట్ ను కూడా తొలగించలేదు. అతడు ప్రస్తుతం `టిల్లు స్క్వేర్` చిత్రం కోసం పని చేస్తున్నాడు. అవతార్ 2 చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.