Begin typing your search above and press return to search.
అందరి చూపు అవతార్ 2 పైనే.. బుకింగులు ఓపెనైనా కానీ!
By: Tupaki Desk | 23 Nov 2022 3:30 AM GMTసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్ కంపెనీలు అన్ని ఖర్చు తగ్గించుకునే పనిలోపడ్డాయి. దీన్ని బట్టి ఆల్ రెడీ ఆర్థిక మాంద్యం వచ్చేసినట్టే.
మాంద్యం ముందే కంపెనీలన్నీ ఉద్యోగులను తీసేస్తుండడంతో ఇక అది వచ్చినట్టే అర్తం చేసుకోవచ్చు. మాంద్యంలోకి ప్రపంచం ఎంటర్ అయినట్టే.. అందరూ భావించిన భయమే నిజం అయ్యిందని చెప్పొచ్చు.
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా తాజాగా మెటా, అమెజాన్, ట్విటర్, సేల్స్ ఫోర్స్ జాబితాలో చేరింది. మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గూగుల్ సైతం 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లోని మొత్తం ఉద్యోగులలో 6 శాతం మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త ర్యాంకింగ్ , పనితీరు మెరుగుదల ప్రణాళిక ద్వారా 10,000 మంది ఉద్యోగులను తగ్గించాలని గూగుల్ యోచిస్తోంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుత దృశ్యకావ్యం.. దశాబ్దపు అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జేమ్స్ కామెరూన్ `అవతార్: ది వే ఆఫ్ వాటర్` ప్రీమియం ఫార్మాట్ లలో టికెట్ సేల్ నేడు దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయనుంది. 16 డిసెంబర్ 2022న ఆంగ్లం- హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళ భాషల్లో `అవతార్: ది వే ఆఫ్ వాటర్` ని విడుదల చేస్తుంది.
ఈ చిత్రం 16 డిసెంబర్ తారీఖున భారతదేశంలోని ఎంపిక చేసిన థియేటర్లలో మిడ్ నైట్ 12 గంటల నుండి ప్రారంభమయ్యే మొదటి షోతో 24 గంటల ప్రదర్శనలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గత 13 ఏళ్లుగా అభిమానులు ఈ క్రేజీ సీక్వెల్ మహోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. ప్రజలంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్ లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలిగా అర్ధరాత్రి మొదటి షో టికెట్లను అమ్మనున్నారు. కామెరాన్ స్వయంగా అవతార్: ది వే ఆఫ్ వాటర్ కి దర్శకత్వం వహించడమే గాక సహరచయితగా కొనసాగారు. సామ్ వర్తింగ్టన్- జో సల్దానా- స్టీఫెన్ లాంగ్ - గియోవన్నీ రిబిసి- జోయెల్ డేవిడ్ మూర్- దిలీప్ రావు- CCH పౌండర్ - మాట్ గెరాల్డ్- సిగౌర్నీ వీవర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. చాలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రేక్షకులను చివరకు జేమ్స్ కామెరూన్ `పండోర` మాయా ప్రపంచానికి తిరిగి తీసుకెళుతున్నారు. 2డి.. 3డిలో ఈ సినిమా విడుదల కానుంది.
కేట్ విన్స్ లెట్- క్లిఫ్ కర్టిస్- ఈడీ ఫాల్కో- బ్రెండన్ కోవెల్- మిచెల్ యో- జెమైన్ క్లెమెంట్-ఊనా చాప్లిన్- డేవిడ్ థెవ్లిస్- విన్ డీజిల్ - CJ జోన్స్ వంటి వారితో పాటు ఎక్కువ మంది కొత్తవారే సీక్వెల్స్ లో నటించనున్నారు.
మూడున్నర గంటల సుదీర్ఘ నిడివి?
జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3 గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ ని కలిగి ఉందని తాజాగా లీకులు అందాయి. ప్రఖ్యాత డిజిటల్ స్పై టాబ్లాయిడ్ నివేదికల ప్రకారం కామెరూన్ సినిమాల్లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ లలో ఒకటి. `అవతార్: ది వే ఆఫ్ వాటర్` కథాంశం ఆసక్తికరం. అవతార్ ముగింపు సంఘటనల తరువాత ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం అనంతరం సాగే కథాంశమిది. సుల్లీ కుటుంబం (జేక్- నేయితిరి .. వారి పిల్లలు).. ఆ కుటుంబానికి ఎదురయయే సవాళ్లు..ఇబ్బందులు.. కాలానికి ఎదురెళ్లే సాహసాలతో గగుర్పొడిచే విన్యాసాలతో ఈ సినిమా ప్రేక్షకులకు మతి తప్పే ట్రీటివ్వబోతోంది.
ఒకరినొకరు సురక్షితంగా కాపాడుకుంటూ... సజీవంగా ఉండటానికి వారు చేసే పోరాటాలు .. అనుభవించే విషాదాలను తెరపై అత్యంత హృద్యంగా కామెరూన్ చిత్రీకరించారు. ఈ సీక్వెల్ కు మాతృక దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించారు. ఆయనే సహ రచయితగా ఉన్నారు. ఇందులో సామ్ వర్తింగ్టన్ - జో సల్దానా- జోయెల్ డేవిడ్ మూర్- దిలీప్ రావు- స్టీఫెన్ లాంగ్- మాట్ గెరాల్డ్ - సిగౌర్నీ వీవర్ తిరిగి తెరపై కనిపిస్తారు. అదనపు తారాగణం సభ్యులలో కేట్ విన్స్లెట్ - ఈడీ ఫాల్కో- మిచెల్ యోహ్- విన్ డీజిల్- జెమైన్ క్లెమెంట్- ఊనా చాప్లిన్ ఉన్నారు.
ఇందులో 2028 వరకు ప్రతి సంవత్సరం విడుదలయ్యే నాలుగు సీక్వెల్ లు ఉంటాయి. ది వే ఆఫ్ వాటర్ తో కలిపి మూడవ (ప్రస్తుతం పేరు పెట్టని) చిత్రం ప్రధాన చిత్రీకరణను పూర్తి చేసేశారని సమాచారం. నాలుగో భాగం ప్రారంభ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఐదవది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఫ్రాంఛైజీలో తారాగణం తిరిగి రిపీటెడ్ గా ప్రతి భాగంలో కనిపిస్తారు.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ 16 డిసెంబర్ 2022న విడుదల కానుంది. అవతార్ 3 చిత్రం 20 డిసెంబర్ 2024న విడుదల కానుంది. ఆ తర్వాత అవతార్ 4 చిత్రం 18 డిసెంబర్ 2026న అలాగే.. అవతార్ 5 చిత్రం 22 డిసెంబర్ 2028న విడుదల కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.