Begin typing your search above and press return to search.

అవ‌తార్ 2 ట్రైల‌ర్ : అబ్బుర ప‌రిచే విజువ‌ల్ వండ‌ర్‌!

By:  Tupaki Desk   |   22 Nov 2022 8:50 AM GMT
అవ‌తార్ 2 ట్రైల‌ర్ : అబ్బుర ప‌రిచే విజువ‌ల్ వండ‌ర్‌!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న మూవీ 'అవ‌తార్ 2'. జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి 'అవ‌తార్‌' కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ కోసం యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఆశ్చ‌ర్యంతో ఎదురుచూస్తోంది. 2009లో పండోరా అంటూ స‌రికొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసి అద్భుత‌మైన విజువ‌ల్స్ తో అబ్బుర ప‌రిచిన జేమ్స్ కెమెరాన్ దాదాపు 13 ఏళ్ల విరామం త‌రువాత మ‌రోసారి అదే త‌ర‌హాకు మించి విజువ‌ల్ వండ‌ర్ గా 'అవ‌తార్ 2'ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

2009లో విడుద‌లైన 'అవ‌తార్‌' వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎపిక్ వండ‌ర్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా ఊహ‌కంద‌ని స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద వసూళ్ల సేనామీని సృష్టించి అన్ బీట‌బుల్ రికార్డ్స్ ని న‌మోదు చేసింది. ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్ గా తెర‌కెక్కిన ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న మూవీ 'అవ‌తార్ : ది వే ఆఫ్ వాట‌ర్‌'. స‌ముద్ర గ‌ర్భంలో ఊహ‌కంద‌ని విజువ‌ల్స్ తో పార్ట్ 1 కి మించి విజువ‌ల్ వండ‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. డిసెంబ‌ర్ 16న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్ ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశ‌గా ఎదురుచూసిన ప్రేక్ష‌కులని స‌ర్ ప్రైజ్ చేస్తూ 'అవ‌తార్ 2' మేక‌ర్స్ రెండు వారాల క్రితం ఫ‌స్ట్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఇది ఇంత వ‌ర‌కు వున్న అంచ‌నాల్ని అమాంతం పెంచేసింది.

తాజాగా మ‌రో ట్రైలర్ ని విడుద‌ల చేశారు. పండోరా స‌మీపంలోని స‌ముద్ర జీవితానికి అల‌వాటు ప‌డిన జేక్, నేయిటిరి ..వారి కుటుంబం..పిల్లల చేసే విన్యాసాలు.. మ‌నుగ‌డ కోసం వారు ప‌డే ఇబ్బందులు.. త‌మ తెగ వారి కోసం జేక్, నేయిటిరి చేసే యుద్ధ విన్యాసాలు.. స‌ముద్ర గ‌ర్భంలో వింత జీవుల‌ని వారి వాహ‌నాలుగా మ‌లుచుని చేసే విన్యాసాలు.. శ‌తృ వ‌ర్గంపై చేసే యుద్దం వంటి విజువ‌ల్స్ అబ్బుర ప‌రుస్తున్నాయి.

'అవ‌తార్‌'ని మించి 'అవ‌తార్ 2' వుంటుంద‌ని సెకండ్ ట్రైల‌ర్ స్ప‌ష్టం చేస్తోంది. ఊహ‌కంద‌ని విజువ‌ల్స్‌, పాత్ర‌ల విన్యాసాల నేప‌థ్యంలో ఆత్యంతం సాగిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని తారా స్థాయికి చేరుస్తోంది. రెండ నిమిషాల నిడివితే సాగిన ఈ ట్రైల‌ర్ లో ప్ర‌తీ ఫ్రేమ్ ఓ అద్భుత‌మే అన్న‌ట్టుగా వుంది. ప్రీ సీన్ ఆక‌ట్టుకుంటోంది. పార్ట్ 1తో స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కెమెరాన్ పార్ట్ 2 తో స‌ముద్ర గ‌ర్భంలో దాగివున్న అద్భుత ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు.

స‌ముద్ర గ‌ర్భంలో చేసే యుద్ధ విన్యాసాలు.. అబ్బుర ప‌రుస్తున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్ గా 120 భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈమూవీని మ‌న ఇండియాలో మొత్తం 7 భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఊహ‌కంద‌ని విధంగా ఈ మూవీ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌ర‌గుతోందని ఇప్ప‌టికే ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య డిసెంబ‌ర్ 16న విడుద‌ల‌వుతున్న ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు కూడా ఈగ‌ర్ గా ఎదురు చూస్తున్నారు. జేక్ పాత్ర‌లో సామ్ వ‌ర్తింగ్ట‌న్‌, నుయిట్రీ పాత్ర‌లో జోయి స‌ల్డానా న‌టించారు. 3డీతో పాటు ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్ ల‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా వున్న చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌ల‌ని రినోవేట్ చేయ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.