Begin typing your search above and press return to search.
ఓపెనింగుల్లో 'అవతార్ 2' ప్రకంపనాలు
By: Tupaki Desk | 15 Dec 2022 5:30 AM GMTజేమ్స్ కామెరూన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' 16 డిసెంబర్ 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అవతార్ 2 భారతదేశంలో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించిందనేది తాజా ట్రేడ్ రిపోర్ట్. ఇప్పటివరకూ భారతదేశంలో రిలీజైన అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులను 'అవతార్ 2' తుత్తునియలు చేసింది. 'ది వే ఆఫ్ వాటర్' 2022లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. ఇది బిగ్ స్క్రీన్ పై మహదాద్భుత దృశ్యాలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ వెల్లడించాయి. ఈ చిత్రం 16 డిసెంబర్ 2022న పెద్ద స్క్రీన్ లపై అత్యంత భారీగా విడుదలవుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి.
అవతార్ 2 ఇప్పుడు అంచనాలకు తగ్గకుండా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది. ముఖ్యంగా ఓపెనింగు రికార్డులన్నిటినీ ఇది తుడిచి పెట్టేసిందని ట్రేడ్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండడంతో టికెట్ విండోస్ కిటకిటలాడుతున్నాయని ట్రేడ్ చెబుతోంది. ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీక్వెల్ కోసం ఇంకా వేచి ఉండలేని పరిస్థితి. కారణం ఏదైనా .. ప్రజల ఉత్కంఠ నడుమ రిలీజ్ కి సిద్ధమైన 'అవతార్ 2' భారతదేశంలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించనుంది. అవతార్ 2 పలు హాలీవుడ్ చిత్రాల ఓపెనింగుల రికార్డులను బ్రేక్ చేస్తోందని సమాచారం.
ఇప్పటివరకూ ప్రపంచంలోనే అతి భారీ ఓపెనింగుల రికార్డుతో 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఇన్ఫినిటీ వార్' స్థిరంగా ఉంది . కానీ ఈ రికార్డును అవతార్ 2 తుడిచి పెట్టేసిందని సమాచారం. ఎండ్ గేమ్ 2019లో విడుదలైంది. ఈ చిత్రం అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. భారతదేశంలో అతిపెద్ద ఓపెనింగ్ లు సాధించిన ఏకైక హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం మొదటి రోజున దేశంలో 53 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత 'స్పైడర్ మాన్: నో వే హోమ్' అంతే సంచలన వసూళ్లతో టాప్ 10లో నిలిచింది. టామ్ హాలండ్ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' 2021 డిసెంబర్ లో విడుదలైంది. ఈ చిత్రం 1వ రోజున 32.67 కోట్లు వసూలు చేసింది.
అవెంజర్స్ సిరీస్ లోని 'ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇండియాలో గా 31.20 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం భారీ ఓపెనింగులను సాధించి టాప్ 10లో నిలిచింది. ఆ తర్వాత 'మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ - డాక్టర్ స్ట్రేంజ్' విడుదలై టాప్ టెన్ జాబితాలో నిలిచింది. బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ తెరకెక్కించిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ 2022లో విడుదల కాగా మొదటి రోజున భారతదేశంలో 28 కోట్లు వసూలు చేసింది.
'థోర్: లవ్ అండ్ థండర్' చిత్రం టాప్ 10 వసూళ్ల జాబితాలో నిలిచింది. క్రిస్ హేమ్స్‌వర్త్ సారథ్యంలోని 'థోర్: లవ్ అండ్ థండర్' 2022లో విడుదలైంది. ఈ చిత్రం భారతదేశంలో మొదటి రోజు రూ.18.20 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
సైలెంట్ గా దూసుకొచ్చిన డ్వేన్ జాన్సన్ - జాసన్ స్టాథమ్ భారీ యాక్షన్ చిత్రం 'హాబ్స్ అండ్ షా' తొలిరోజే 13 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా టాప్ 10 లిస్ట్ లో నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.