Begin typing your search above and press return to search.
`ఎండ్ గేమ్` రికార్డుని బ్రేక్ చేసి నంబర్ 1గా అవతార్
By: Tupaki Desk | 15 March 2021 8:30 AM GMTజేమ్స్ కామెరాన్ ప్రస్తుతం అవతార్ సీక్వెల్స్ షూటింగ్ లో బిజీగా ఉండగా అతడికి శుభవార్త అందింది. అవతార్ ఇటీవలే చైనాలో తిరిగి విడుదలై అసాధారణ వసూళ్లతో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ గా నిలవడం హాట్ టాపిక్ గా మారింది.
అవతార్ చిత్రం ఒక దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్లో నిలిచి ఉండగా 2019లో రిలీజైన ఎవెంజర్స్ -ఎండ్ గేమ్ ఆ రికార్డుల్ని బ్రేక్ చేసి నంబర్ వన్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2.7897 బిలియన్ల వసూళ్లతో అవతార్ సంచలనం సృష్టిస్తే.. `ఎండ్ గేమ్` వరల్డ్ వైడ్ 2.7902 బిలియన్ డాలర్లు సంపాదించి ఆ రికార్డును బ్రేక్ చేసింది.
తాజాగా అవతార్ చైనాలో రీ-రిలీజ్ తో 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి తిరిగి మొదటి స్థానానికి చేరుకుందని ఎవెంజర్స్ రికార్డును బ్రేక్ చేసిందని నిర్మాతలు ప్రకటించడం సంచలనమైంది. ఇదే విషయాన్ని మార్వెల్ స్టూడియోస్ -రస్సో బ్రదర్స్ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసుకోవడం ఆసక్తికరం. అవతార్ నిర్మాతలు వారి సోషల్ మీడియా ఖాతాల్లో శుభాభివందనలు అందుకున్నారు.
అవతార్ తిరిగి అగ్రస్థానాన్ని కైవశం చేసుకోవడంపై మార్వెల్ స్టూడియోస్ కూడా స్పందిస్తూ, ``బాక్సాఫీస్ కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు జేమ్స్ కామెరాన్.. జాన్ లాండౌ ఇతర టీమ్ అందరికీ అభినందనలు! మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం..`` అని పేర్కొంది.
డిసెంబర్ 2022 నుండి డిసెంబర్ 2028 వరకు నాలుగు అవతార్ సీక్వెల్స్ ను విడుదల చేసేందుకు కామెరూన్ టీమ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.