Begin typing your search above and press return to search.
'అవతార్ 2' ఓపెనింగులు.. అన్ని రికార్డులకు ఝలక్
By: Tupaki Desk | 3 Nov 2022 5:31 AM GMTజేమ్స్ కామెరూన్ 'అవతార్' సంచలనాల గురించి చెప్పాల్సిన పని లేదు. పండోరా మాయా ప్రపంచంలో ప్రపంచ సినీప్రియులను ఓలలాడించిన ఘనుడు కామెరూన్. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీ నుంచి పార్ట్ 2 విడుదలవుతుండడం వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.
అవతార్ ఫ్రాంచైజీ రెండవ విడత థియేట్రికల్ ట్రైలర్ - 'ది వే ఆఫ్ వాటర్' వీక్షించాక ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్ కి అన్ని వర్గాల నుండి అద్భుతమైన ఆదరణ దక్కింది. అవతార్ 2 తిరిగి అవతార్ రికార్డులనే బ్రేక్ చేస్తుందని..అవెంజర్స్ సహా అన్ని సినిమాల రికార్డులను చెరిపేస్తూ సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలు వెలువరించారు. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి.
బాక్సాఫీస్ విశ్లేషకుల ముందస్తు అంచనాల ప్రకారం అవతార్ 2 భారతదేశంలో సంచలన ఓపెనింగులను సాధిస్తుందని భావిస్తున్నారు. 'అవతార్ -2' భారతదేశంలో ప్రారంభ రోజున రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా. ఇది దేశీయ మార్కెట్ లో అతిపెద్ద హాలీవుడ్ ఓపెనర్ లలో ఒకటిగా మారుతుంది. అవతార్ 2 భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన ఆంగ్ల చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 16న విడుదలవుతున్న ఈ చిత్రం భారతీయ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాయడం ఖాయం.
జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3 గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్‌ని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది జేమ్స్ కామెరూన్ యొక్క ఎపిక్ సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ దాదాపు మూడు గంటల పది నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంటుంది.
బాలీవుడ్ హంగామా న్యూస్ నెట్‌వర్క్ -నవంబర్ 2, 2022 - 6:22 PM IST జేమ్స్ కామెరూన్ యొక్క వేడిగా ఎదురుచూసిన సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ మొదటి అధ్యాయం కంటే పొడవుగా ఉన్నట్లు నిర్ధారించబడింది. మాగ్నమ్ ఓపస్ 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంటుంది, ఇది టైటానిక్ (3 గంటల 14 నిమిషాలు) తర్వాత ఇప్పటి వరకు కామెరాన్ యొక్క పొడవైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
మూడున్నర గంటల షో...?
జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3 గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ ని కలిగి ఉందని తాజాగా లీకులు అందాయి. ప్రఖ్యాత డిజిటల్ స్పై టాబ్లాయిడ్ నివేదికల ప్రకారం కామెరూన్ సినిమాల్లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఇందులో 2028 వరకు ప్రతి సంవత్సరం విడుదలయ్యే నాలుగు సీక్వెల్ లు ఉంటాయి. ది వే ఆఫ్ వాటర్ తో కలిపి మూడవ (ప్రస్తుతం పేరు పెట్టని) చిత్రం ప్రధాన చిత్రీకరణను పూర్తి చేసేశారని సమాచారం. నాలుగో భాగం ప్రారంభ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఐదవది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఫ్రాంఛైజీలో తారాగణం తిరిగి రిపీటెడ్ గా ప్రతి భాగంలో కనిపిస్తారు.
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కథాంశం ఆసక్తికరం. అవతార్ ముగింపు సంఘటనల తరువాత ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం అనంతరం సాగే కథాంశమిది. సుల్లీ కుటుంబం (జేక్- నేయితిరి .. వారి పిల్లలు).. ఆ కుటుంబానికి ఎదురయయే సవాళ్లు..ఇబ్బందులు.. కాలానికి ఎదురెళ్లే సాహసాలతో గగుర్పొడిచే విన్యాసాలతో ఈ సినిమా ప్రేక్షకులకు మతి తప్పే ట్రీటివ్వబోతోంది.
ఒకరినొకరు సురక్షితంగా కాపాడుకుంటూ... సజీవంగా ఉండటానికి వారు చేసే పోరాటాలు .. అనుభవించే విషాదాలను తెరపై అత్యంత హృద్యంగా కామెరూన్ చిత్రీకరించారు. ఈ సీక్వెల్ కు మాతృక దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించారు. ఆయనే సహ రచయితగా ఉన్నారు. ఇందులో సామ్ వర్తింగ్టన్ - జో సల్దానా- జోయెల్ డేవిడ్ మూర్- దిలీప్ రావు- స్టీఫెన్ లాంగ్- మాట్ గెరాల్డ్ - సిగౌర్నీ వీవర్ తిరిగి తెరపై కనిపిస్తారు. అదనపు తారాగణం సభ్యులలో కేట్ విన్స్లెట్ - ఈడీ ఫాల్కో- మిచెల్ యోహ్- విన్ డీజిల్- జెమైన్ క్లెమెంట్- ఊనా చాప్లిన్ ఉన్నారు.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ 16 డిసెంబర్ 2022న విడుదల కానుంది. అవతార్ 3 చిత్రం 20 డిసెంబర్ 2024న విడుదల కానుంది. ఆ తర్వాత అవతార్ 4 చిత్రం 18 డిసెంబర్ 2026న అలాగే.. అవతార్ 5 చిత్రం 22 డిసెంబర్ 2028న విడుదల కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.