Begin typing your search above and press return to search.
పదమూడు రోజుల్లో ఎవెంజర్స్ రికార్డు
By: Tupaki Desk | 11 May 2018 8:03 AM GMTఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆ సినిమా విడుదల కోసం ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యాక కొందరు చాలా బాగుందంటే... మరికొందరు ఊహించనంతగా లేదు అని నిట్టూర్చారు. అభిప్రాయాల మాట ఎలా ఉన్నా సినిమా విడుదలై పదమూడు రోజులు అవుతున్నా... కలెక్షన్ల దూకుడు ఏమాత్రం తగ్గలేదు.
ఎవెంజర్స్ సినిమా ఇంకా బాక్సాఫీసు దగ్గర కాసులు రాలుస్తూనే ఉంది. రెండు వారాలు అవుతున్నా ఇంకా సినీ ప్రేమికులు వస్తూనే ఉన్నారు. కేవలం ఇండియోలోనే పదమూడు రోజుల్లో ఈ సినిమా రెండు వందల కోట్ల మార్కును దాటేసింది. ఇది ఓ రికార్డు. గతంలో జంగిల్ బుక్ మీద ఉన్న రికార్డును తిరగరాసేసింది ఎవెంజర్స్. మామూలుగానే మనవాళ్లు హాలీవుడ్ మూవీస్ అంటే చెవి కోసుకుంటారు. ఇక సూపర్ హీరోలంతా ఏకమయ్యే సినిమాను వదిలి పెడతారా. అందుకు ఎవెంజర్స్ ఇంత పెద్ద హిట్ కొట్టింది. ఇప్పటికీ ఇంకా కొన్ని థియేటర్లలో ఎవెంజర్స్ ఆడుతూనే ఉంది. ఇండియాలో రెండు వారాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమా జాబితా ఇలా ఉంది
1. జంగిల్ బుక్ (2016 - రూ. 188 కోట్లు
2. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ( 2015) - రూ.98 కోట్లు
3. జురాసిక్ వరల్డ్ (2015) - రూ. 91 కోట్లు
4. ఫ్యూరియస్ 8 (2015) - రూ. 87 కోట్లు
5. ఎవెంజర్స్ - ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ (2015) - రూ.77 కోట్లు