Begin typing your search above and press return to search.

అవెంజ‌ర్స్ 4: డే2 ఇండియాలో 100కోట్లు

By:  Tupaki Desk   |   28 April 2019 6:47 AM GMT
అవెంజ‌ర్స్ 4: డే2 ఇండియాలో 100కోట్లు
X
ప్ర‌పంచవ్యాప్తంగా `అవెంజ‌ర్స్ - ఎండ్` గేమ్ పెనుదుమారం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్ని దేశాల్లోనూ రికార్డులు బ్రేక్ చేస్తూ ఎండ్ గేమ్ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ దెబ్బ‌కు లోక‌ల్ సినిమాలు బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇండియా నుంచి ఈ సినిమా ఫుల్ ర‌న్ లో 500 కోట్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంచ‌నా వేస్తోంది ట్రేడ్. రిలీజైన తొలిరోజు రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో నంబ‌ర్ 1 ఓపెన‌ర్ గా ఉన్న అమీర్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` రికార్డును హాలీవుడ్ చిత్రం `అవెంజ‌ర్స్- ఎండ్ గేమ్` బ్రేక్ చేసింది. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ తొలి రోజు రూ. 52.25 కోట్లు వసూలు చేయగా.. ఎండ్ గేమ్ రూ. 53.10 కోట్లు రాబట్టింది. రెండోరోజు ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఊపు ఆదివారం స‌హా ఈ వారం అంతా క‌నిపించేట్టు ఉంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

భార‌త‌దేశం.. చైనాల్లో `ఎండ్ గేమ్` చిత్రాన్ని మార్వ‌ల్ - డిస్నీ సంస్థ‌లు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేశాయి. భార‌త‌దేశంలో ఏకంగా 2845 స్క్రీన్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమారం రేపింది. చాలా చోట్ల టికెట్స్ దొరక్క ప్రేక్షకుల్లో అస‌హ‌నం క‌నిపించింది. పిల్లా పాప‌ల‌తో క‌లిసి కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ క్యూలో క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యప‌రిచింది. అస‌లే వేస‌వి సెల‌వులు కాబ‌ట్టి ఈ సీజ‌న్ అవెంజ‌ర్స్ కి బాగా క‌లిసొచ్చింద‌ని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్కూల్- కాలేజ్ విద్యార్థుల ఆద‌ర‌ణ ఈ చిత్రానికి గొప్ప‌గా ఉంద‌ని తెలుస్తోంది.

ఎండ్ గేమ్ రెండో రోజు వ‌సూళ్ల‌ను ప‌రిశీలిస్తే.. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం శనివారం రూ. 60 కోట్ల వరకు రాబట్టిందిట‌. రెండు రోజుల్లో ఇండియా కలెక్షన్స్ రూ. 100 కోట్ల మార్క్ ను ట‌చ్ చేసింది. ఇక చైనాలోనూ అవెంజ‌ర్స్ అంతే దూకుడు చూపిస్తోంది. అమెరికా- ఇండియా- చైనా స‌హా ఇత‌ర దేశాల వ‌సూళ్ల‌ను క‌లుపుకుని ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లోనే సుమారు 6900 కోట్లు (1 బిలియ‌న్ డాల‌ర్) వ‌సూలు చేసే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజుల్లో ఏమేర‌కు వ‌సూలు చేసింది? అన్న‌ది తెలియాల్సి ఉంది.