Begin typing your search above and press return to search.
అవతార్ రికార్డుకు ఎసరు పెట్టనున్న అవెంజర్స్
By: Tupaki Desk | 13 Jun 2019 5:30 PM GMTబాక్స్ ఆఫీస్ రికార్డుల విషయంలో ఇండియాకు 'బాహుబలి' ఎలానో ప్రపంచం మొత్తానికి 'అవతార్' అలాగ. $2.78 బిలియన్ గ్రాస్ తో ప్రపంచంలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'అవతార్' ఇప్పటికీ కొనసాగుతోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వలో తెరకెక్కిన 'అవతార్' 2009 లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ ఏ ఒక్కటీ 'అవతార్' కలెక్షన్లకు దరిదాపుల్లోకి చేరలేకపోయింది. ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఆ రికార్డుకు 'అవెంజర్స్: ఎండ్ గేమ్' ఎసరుపెట్టేలా ఉంది.
ఏప్రిల్ 26 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా $2.73 బిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో రెండవ స్థానంలో ఉన్న 'టైటానిక్' ను మూడవ స్థానానికి నెట్టేసిన ఈ చిత్రం ప్రస్తుతం 'అవతార్' రికార్డుకు ఎసరు పెట్టే దిశగా కొనసాగుతోంది. ఈ సినిమా రిలీజై దాదాపు ఒకటిన్నర నెల దాటినా ఇంకా కలెక్షన్స్ ఫిగర్ పెరుగుతూనే ఉంది. ఇదే ఊపు కొనసాగితే అతి త్వరలో 'అవతార్' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు గోవిందా గోవిందా!
మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ చిత్రానికి బడ్జెట్ $356 మిలియన్లు. ఇప్పటికే సినిమా బడ్జెట్ కు ఏడు రెట్లు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఫిగర్ వచ్చేసరికి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ చిత్రం ఇండియాలోనే మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం గమనార్హం. ఈ సినిమాకు దర్శకత్వం వహించినవారు రూసో బ్రదర్స్. రాబర్ట్ డౌనీ జూనియర్.. మార్క్ రఫాలో.. క్రిస్ హెమ్స్ వర్త్.. స్కార్లెట్ జాన్సన్.. జెరెమీ రెన్నర్.. పాల్ రడ్.. బ్లీ లార్సన్ .. బ్రాడ్లీ కూపర్.. జోష్ బ్రోలిన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.