Begin typing your search above and press return to search.
ఆస్కార్ 2020: ఎవెంజర్స్ Vs జోకర్
By: Tupaki Desk | 17 Dec 2019 5:30 PM GMTఆస్కార్ 2020 నామినేషన్ల జాబితా కొద్దిసేపటి క్రితం రివీలైన సంగతి తెలిసిందే. టాప్ 10 సినిమాల జాబితాలో ఇండియన్ మూవీ `గల్లీ బోయ్` కనిపించకపోవడం సినీప్రియుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక టాప్ 10లో రకరకాల సాంకేతిక విభాగాలకు పోటీపడుతున్న వాటిలో మూడు కామిక్ బుక్ ఆధారిత సినిమాలు షార్ట్ లిస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ విజువల్ గ్రాఫిక్స్.. ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన సూపర్ హీరో సినిమాల్ని అకాడమీ ఎప్పుడు ప్రధాన అవార్డుల కేటగిరీకి పంపించదు. ఆయా చిత్రాల్ని సాంకేతిక విభాగంలో పరిశీలించేందుకే ఆస్కార్ కమిటీ ఆసక్తిని చూపిస్తుంటుంది.
ఈసారి 2019 బ్లాక్ బస్టర్లలో ఓ మూడు చిత్రాలు ఇదే తీరుగా పరిశీలనకు అర్హత సాధించాయి. ఈ ఏడాది అతి భారీగా తెరకెక్కిన కామిక్ బుక్ మూవీస్ ఆస్కార్ నామినేషన్ల పరిశీలనలో ఉన్నాయి. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్- జోకర్ - కెప్టెన్ మార్వెల్ చిత్రాలు పలు సాంకేతిక విభాగాలకు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. మునుపెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మార్వెల్ సినిమా ఎవెంజర్స్ రెండు విభాగాల్లో పోటీపడుతోంది.
ఎవెంజర్స్: ఎండ్ గేమ్ ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోరు) - ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పోటీపడుతుండగా.. బ్రై లార్సన్ తెరకెక్కించిన `కెప్టెన్ మార్వెల్` ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో షార్ట్ లిస్ట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆస్కార్ నామినేషన్ కోసం ఎవెంజర్స్ సినిమాలు పోటీపడడం అన్నది ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు `ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్` ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డుకు ఎంపికైంది.
మరోవైపు.. వార్నర్ బ్రదర్స్ తెరకెక్కించిన `జోకర్` సైలెంటుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఇటీవల వరల్డ్ వైడ్ ఎంతో ఆసక్తిగా మాట్లాడుకున్న క్రేజీ మూవీ ఇది. 2020 ఆస్కార్స్ ఫేవరెట్ మూవీ ఇది. జాక్విన్ ఫీనిక్స్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్- 2020 అవార్డ్స్.. సాగ్ అవార్డ్స్ 2020 లో అనేక నామినేషన్లను పొందింది. తాజాగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన జోకర్ ఆస్కార్ 2020 నామినేషన్ జాబితాను శాసిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రెండు విభాగాల్లో షార్ట్ లిస్ట్ అయ్యింది. ఇది ఒరిజినల్ స్కోరు విభాగంలో `ఎవెంజర్స్: ఎండ్‌గేమ్`తో పోటీపడుతుంది. మేకప్- హెయిర్‌స్టైలింగ్ విభాగంలోనూ ఈ చిత్రం అవార్డుకు పటీపడుతోంది. అయితే తాజాగా వెలువడిన వివరాలు హాలీవుడ్ మీడియా వెల్లడించినవి. అకాడమీ అవార్డుల కమిటీ ఇంకా తదుపరి వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. 92వ అకాడమీ అవార్డుల నామినేషన్ జాబితా 13 జనవరి 2020 న ప్రకటిస్తారు.