Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్లను వెనకేస్తున్న మార్వెల్ హీరోస్
By: Tupaki Desk | 27 April 2019 2:30 PM GMTఅసలు ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో లేక జనానికి దీని మీద ముందు నుంచే ఇలాంటి ఆరాధనా భావం ఉందేమో తెలియదు కాని అవెంజర్స్ ప్రకంపనలతో బాక్స్ ఆఫీస్ షేకైపోతోంది. మొదటిరోజు ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ రాబట్టిన సూపర్ హీరోలు ఫైనల్ రన్ లోపు ఎన్ని అద్భుతాలు చేస్తారో అంతు చిక్కడం లేదు. ఇక రాష్ట్రాలతో సంబంధం లేకుండా దీని దెబ్బకు స్టార్ హీరోల రికార్డులు సైతం గల్లంతు అవుతున్నాయి. దానికి ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు.
చెన్నై నగరంలో ఇప్పటిదాకా హయ్యెస్ట్ ఓపెనింగ్ రెండు సినిమాల పేరు మీద ఉంది. ఒకటి రజనికాంత్ పేట 1 కోటి 12 లక్షలతో అగ్ర స్థానంలో ఉండగా రెండో ప్లేస్ లో అజిత్ విశ్వాసం 88 లక్షలతో ఉంది. చల్ ఇది ఒక రికార్డేనా అనుకున్న అవెంజర్స్ ఆ రెండింటిని స్మాష్ చేస్తూ ఏకంగా 1 కోటి 17 లక్షలు వసూలు చేసి బాప్ రే బాప్ అనిపించేసింది. దీంతో చెన్నై సిటీలో ఫస్ట్ డే రికార్డుని అధికారికంగా తన ఖాతాలో వేసుకున్నారు అవెంజర్స్
ఇది ఒక్క చెన్నైకే పరిమితం కాలేదు. చాలా చోట్ల దేశంలో నాన్ బాహుబలి రికార్డులపై అవెంజర్స్ కన్ను వేసింది. మళ్ళి ఇంకో హాలీవుడ్ సినిమాకు ఇలాంటి వసూళ్లు చూడగలమా అనే రేంజ్ లో రచ్చ చేస్తోంది. ఇక్కడి స్టార్లు చేసే మాస్ మసాలా మూవీస్ కి ఇలాంటి భీభత్సమైన కలెక్షన్స్ రావడం సహజమే కాని మనవాళ్ళకు పెద్దగా పరిచయం లేని అమెరికా నటుల సినిమాకు ఈ ఫిగర్స్ అంటే షాక్ కాక మరేమిటి.
ఇప్పుడు వీకెండ్ అయ్యాక ఎలాంటి లెక్కలు బయటికి వస్తాయో అన్న ఆసక్తి ట్రేడ్ లో నెలకొంది. మన దగ్గర అర్జున్ సురవరంతో పాటు తమిళ్ లో దేవి 2 లాంటి క్రేజీ మూవీస్ కూడా కేవలం అవెంజర్స్ క్రేజ్ పుణ్యమా అని ధియేటర్స్ దొరక్కే వాయిదా వేసుకున్నాయి. అదండీ వాస్తవ పరిస్థితి