Begin typing your search above and press return to search.
అవతార్ రికార్డులు ఇన్నాళ్టికి బ్రేక్?
By: Tupaki Desk | 5 May 2019 7:38 AM GMTప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ - ఎండ్ గేమ్ సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన అన్ని దేశాల్లోనూ బాక్సాఫీస్ వసూళ్లను అదరగొడుతోంది. చైనా- అమెరికా- బ్రిటన్ -కొరియా- మెక్సికో- ఇండియా దేశాల్లో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డుల్ని తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా ప్రతిష్ఠాత్మక 2 బిలియన్ డాలర్ క్లబ్ లో చేరిందని ప్రముఖ క్రిటిక్ రమేష్ బాలా వెల్లడించారు. శనివారం నాటికే 1.78 బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం సృష్టించిందని ప్రకటించిన అనంతరం ప్రముఖ క్రిటిక్స్ లేటెస్ట్ అప్ డేట్ ని అందించారు. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ నంబర్ -1 గా ఉన్న అవతార్ రికార్డును బ్రేక్ చేసే దిశగా `ఎండ్ గేమ్`దూసుకెళుతోంది.
టిల్ డేట్.. 2 బిలియన్ డాలర్లు వసూలు చేసిన ఫాస్టెస్ట్ మూవీగా `ఎండ్ గేమ్` చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలో 560 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.., ప్రపంచవ్యాప్తంగా 1.440 బిలియన్ డాలర్లు వసూలు చేసిందని తెలుస్తోంది. 2 మిలియన్ డాలర్లు అంటే రూ.13, 835 కోట్లు. ఇక దశాబ్ధం క్రితం అవతార్ నెలకొల్పిన 2.78 డాలర్ల రికార్డును `అవెంజర్స్ 4` బ్రేక్ చేయనుంది. ఇప్పటికే మార్వల్ సినిమాటిక్స్ సంస్థ నిర్మించిన 20 పైగా సినిమాల రికార్డుల్ని `ఎండ్ గేమ్` బ్రేక్ చేయనుందని రిపోర్ట్ అందింది. `అవెంజర్స్ - ఇన్ ఫినిటీ వార్` 2.05 బిలియన్ డాలర్లు.. స్టార్ వార్స్ - ది ఫోర్స్ అవేకెన్స్ 2.07 బిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ 5లో నిలిచాయి. ఈ రికార్డులన్నిటినీ ఎండ్ గేమ్ ఈ వారంలో బ్రేక్ చేయనుంది.
అయితే ఎండ్ గేమ్ ఎన్ని రికార్డుల్ని బ్రేక్ చేసినా పదేళ్ల క్రితం సామాజిక ఆర్థిక పరిస్థితులు.. టిక్కెట్టు రేట్లను బేరీజు వేస్తే `అవతార్`(2009) రికార్డుకు ఉన్న ప్రత్యేకత గొప్పదని విశ్లేషిస్తున్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం అమెరికాలో సినిమా టిక్కెట్టు ధర 20 శాతం పెరిగింది. అలాగే డాలర్ మారకం విలువ ఇప్పుడు మరింత పెరిగిందని చెబుతున్నారు. పైగా జేమ్స్ కామెరూన్- అవతార్ తో పోలిస్తే ఎండ్ గేమ్ చాలా ఎక్కువ మొత్తంలో థియేటర్లలో రిలీజైంది. చాలా పరిమిత థియేటర్లలో రిలీజైన అవతార్ సాధించిన సెన్సేషన్స్ ముందు ఎండ్ గేమ్ సాధించిందేమీ లేదని క్రిటిక్స్ విశ్లేషించడం ఆసక్తికరం. 2009లో ఇప్పటి టిక్కెట్టు ధర ఉన్నట్టయితే అవతార్ కేవలం అమెరికాలోనే 760 మిలియన్ డాలర్లు వసూలు చేసేదని .. చైనాలోనూ అదే తీరుగా సంచలనాలు సృష్టించి ఉండేదని విశ్లేషిస్తున్నారు. చైనాలో అప్పట్లోనే అవతార్ 204 మిలియన్ అమెరికా డాలర్లు వసూలు చేసింది. ఎండ్ గేమ్ ప్రస్తుతం చైనాలో 460 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ పదేళ్లలో చైనాలో టిక్కెట్టు ధర.. థియేటర్ల సంఖ్య ఇవన్నీ బేరీజు వేస్తే అవతార్ రికార్డు గొప్పదని విశ్లేషిస్తున్నారు.
భారతదేశంలో ఎండ్ గేమ్ రికార్డుల్ని పరిశీలిస్తే.. `ది జంగిల్ బుక్` నెలకొల్పిన ఫుల్ రన్ రికార్డ్ 38.8 మిలియన్ల అమెరికన్ డాలర్ రికార్డుని ఎండ్ గేమ్ అధిగమించింది. భారతదేశంలో అన్ని వెర్షన్లు కలుపుకుని 2845 థియేటర్లలో ఎండ్ గేమ్ రిలీజైన సంగతి తెలిసిందే. చాలా హిందీ సినిమాలతో పోలిస్తే అతి తక్కువ థియేటర్లలో రిలీజై వాటన్నిటి రికార్డులు బ్రేక్ చేసిన సినిమాగా ఎండ్ గేమ్ చరిత్ర సృష్టించింది.