Begin typing your search above and press return to search.
థియేటర్లు ఇవ్వకుండా నలిపేశారు!
By: Tupaki Desk | 27 April 2019 5:30 PM GMT`అవెంజర్స్- ఎండ్ గేమ్` దెబ్బకు చిన్న సినిమాలు ఐపు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అసలు రిలీజయ్యాయో లేదో కూడా తెలీని ధైన్య ంలో కి వెళ్లిపోయాయి. ఈ సునామీ ముందు తుఫాన్ లు వచ్చినా ఆగవు అన్నట్టే ఉంది సన్నివేశం. అయితే ఈ సునామీ తాకిడికి ఓ యువదర్శకుడు.. హీరో తాను అనవసరంగా నలిగిపోయానని ఆవేదనకు గురవ్వడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. నిన్నటి సాయంత్రం క్రిటిక్స్ కోసం వేసిన షోలో దిక్సూచి సినిమా ఫర్వాలేదన్న టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకి అవెంజర్స్ దెబ్బ పడింది. పైగా నైజాంలో థియేటర్లు ఇవ్వలేదని దర్శకుడు హీరో దిలీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిలీప్ కుమార్ సల్వాది హీరోగా నటించి డైరెక్ట్ చేసిన డివోషనల్ క్రైమ్ డ్రామా దిక్సూచి ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 65 థియేటర్లలో రిలీజైంది ఈ చిత్రం. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందిన ఈ సినిమాకి నైజాంలో ఆశించిన థియేటర్లు దక్కలేదని .. అయితే సినిమా రిలీజైన అన్నిచోట్లా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుందని చిత్ర దర్శకుడు దిలీప్ కుమార్ చెబుతున్నారు. దర్శకుడు.. హీరో దిలీప్ కుమార్ మాట్లాడుతూ-``అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాతో పోటీపడుతూ మా సినిమాని రిలీజ్ చేసిన మాట వాస్తవమే అయినా.. సినిమా బావుంది అన్న ప్రశంసలు దక్కాక అయినా ఎగ్జిబిటర్లు థియేటర్లు ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోంది. ఏపీ- నైజాంలో 65 థియేటర్లలో రిలీజ్ చేశాం. ఇందులో మెజారిటీ పార్ట్ ఏపీలోనే. నైజాంలో కేవలం మూడు థియేటర్లు మాత్రమే ఇచ్చారు. అయితే హైదరాబాద్ లాంటి చోట్ల మల్టీప్లెక్స్ థియేటర్లలో మా సినిమాకి అవకాశం కల్పిస్తే గొప్ప మైలేజ్ ఉంటుందన్న నమ్మకం జనాల స్ప ందన చూశాక కలిగింది. థియేటర్లు ఇవ్వలేదు అని ఎవరినీ నిందించను. సినిమా బావుందో లేదో చూసి థియేటర్లు ఇస్తారని ఆశిస్తున్నాను. పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి థియేటర్లలో సినిమా పడితే బాగా ఆడుతుందని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంలో నాకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం సినిమా చూపిస్తాను అంటే చూసేందుకే రావడం లేదు.. ఏడాది పాటు శ్రమించి .. బాలనటుడిగా హీరోగా అనుభవం ఉన్న నేను.. దర్శకహీరోగా ప్రయత్నించిన సినిమాని జనాలకు చేరువ చేయలేకపోతున్నాననే ఆవేదన ఉంది. తెలుగు గడ్డపై తెలుగువాడికి అవకాశం ఇవ్వరా? అని కలత చెందుతున్నాను`` అని అన్నారు.
మా సినిమాకి అమెరికా లాంటి చోట అవెంజర్స్ రిలీజైన ఈ టైమ్ లో 40 షోలు ఇప్పటికే ఆడించగలిగాం. కానీ నైజాంలో థియేటర్లు దొరక్కపోవడం ఆవేదనకు గురి చేస్తోంది. నైజాం పరిశీలిస్తే.. హైదరాబాద్ లో రెండు థియేటర్లు.. నాగర్ కర్నూల్ ఓ థియేటర్ దక్కాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ థియేటర్లలో రిలీజైతే జనాలకు చేరువవుతుందని.. బాగా ఆడుతుందని నమ్మకం ఉంది. నేను ఎవరినీ నిందించను. అయితే సినిమాలో సత్తా ఉందని ఇప్పటివరకూ వీక్షించిన క్రిటిక్స్ .. ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే కనీసం థియేటర్ల వ్యవస్థలో చిన్న సినిమాకి మంచి సినిమాకి కనీస రిజర్వేషన్ కావాలని ... మాలాంటి వాళ్లని బతకనివ్వాలని కోరుతున్నాను. బాలేదు అన్న కారణంతో కాకుండా బావుండీ నా నిర్మాతల కళ్లలో ఆనందం చూడలేకపోతున్నాను అని దిలీప్ ఆవేదన చెందారు.