Begin typing your search above and press return to search.

14 వేల కోట్లు.. అవెంజ‌ర్స్ 4 వ‌సూళ్ల అంచ‌నా

By:  Tupaki Desk   |   29 April 2019 6:19 AM GMT
14 వేల కోట్లు.. అవెంజ‌ర్స్ 4 వ‌సూళ్ల అంచ‌నా
X
అవెంజ‌ర్స్ 4 సునామీ వ‌సూళ్ల గురించి తెలిసిందే. అవెంజ‌ర్స్ సిరీస్ లో చివ‌రి సినిమా `ఎండ్ గేమ్` బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని న‌మోదు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే 1 బిఇయ‌న్ డాల‌ర్ (6900 కోట్లు) వ‌సూళ్ల రికార్డును అందుకుని.. ఫుల్ ర‌న్ లో 2 బిలియ‌న్ డాల‌ర్లు (సుమారు 14000 కోట్లు) వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ లైఫ్ టైమ్ రికార్డుల జాబితాలో టైటానిక్ (1997) .. అవ‌తార్ (2009) .. స్టార్ వార్స్ - ది ఫోర్స్ అవేకెన్స్ (2015)... పేర్లు సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. ఈ మూడు సినిమాలు 2 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేశాయి.. ఆ రికార్డును అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్ బ్రేక్ చేయ‌బోతోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. 2015లో రిలీజైన `ది ఫోర్స్ అవేకెన్స్` చిత్రం 2.07 బిలియ‌న్ డాల‌ర్ల ఫుల్ ర‌న్ వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తే ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ కాబోతోందంటూ ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్.. లైవ్ మింట్ సంచ‌ల‌న క‌థ‌నాల్ని వెలువ‌రించాయి. ఎవెంజ‌ర్స్ సిరీస్ లో చివ‌రి సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు సెంటిమెంటుగా ఫీల‌వుతున్నార‌ని ప‌లు క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ సెంటిమెంటు సునామీ వ‌సూళ్ల‌కు కార‌ణ‌మ‌న్న‌ది తాజా విశ్లేష‌ణ‌.

అమెరికా- కెన‌డా వ‌సూళ్లు ఇప్ప‌టికే 350 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ట‌చ్ చేయ‌గా.. ఆ రెండు దేశాల్లో అన్ని పాత రికార్డుల్ని ఎండ్ గేమ్ బ్రేక్ చేసింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా నివ‌శించే నం.1 దేశం చైనా నుంచి ఇప్ప‌టికే 330 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇండియా నుంచి 100 కోట్లు కొల్ల‌గొట్టింది. కేవ‌లం అమెరికా నుంచే ఈ సినిమా 800 మిలియ‌న్ డాల‌ర్లు పైగా వ‌సూలు చేసే వీలుంద‌ని ఓ అంచ‌నా వెలువ‌డింది. `అవెంజ‌ర్స్ -ఇన్ ఫినిటీ వార్` (ఫ్రాంఛైజీ లో 3వ చిత్రం) అమెరికా నుంచి 985 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. అంటే ఈ సిరీస్ చివ‌రి సినిమా అంత‌కుమించి వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని చెబుతున్నారు. ఓవ‌రాల్ గా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ 2.07 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల రికార్డుని బ్రేక్ చేసి ప్ర‌పంచ నంబ‌ర్ -1 సినిమాగా స‌రికొత్త రికార్డును నెల‌కొల్ప‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ఆస‌క్తిక‌రంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐమ్యాక్స్ 3డి థియేట‌ర్ల నుంచి 92 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూల‌య్యాయ‌ని తెలుస్తోంది. మునుప‌టితో పోలిస్తే ఐమ్యాక్స్ వ‌సూళ్లు డ‌బుల్ అయ్యాయ‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌. ఎండ్ గేమ్ చిత్రాన్ని 4DX ఫార్మాట్ లోనూ రిలీజ్ చేస్తే ప‌రిమితంగా ఉన్న ఈ థియేట‌ర్ల నుంచి 15 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలైందిట‌. కేవ‌లం ఉత్త‌ర అమెరికాలో 39 మిలియ‌న్ల టిక్కెట్లు ఇప్ప‌టివ‌ర‌కూ సేల్ అయ్యాయ‌ని తెలుస్తోంది.