Begin typing your search above and press return to search.
అర్ధరాత్రి నుంచే అవెంజర్స్ హంగామా
By: Tupaki Desk | 24 April 2019 4:12 AM GMTఇంకా విడుదలకు మూడు రోజులు ఉండగానే అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డుల ఊచకోతకు తెరతీసింది. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రెస్పాన్స్ దీనికే కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ హోరెత్తిపోతున్నాయి . కనివిని ఎరుగని వసూళ్లు నమోదు కావడం ఖాయమని బయ్యర్లు ధీమాగా చెబుతున్నారు. దీని దెబ్బకు మంచి స్వింగ్ లో ఉన్న జెర్సీ-కాంచన 3 మీద దెబ్బ భారీగా పడేలా ఉంది .
ఇదిలా ఉండగా అవెంజర్స్ మరో రికార్డు సెట్ చేయబోతోంది. టైంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి నుంచే షోలు వేసేలా చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోందట. ముంబై వడాలాలోని కార్నివాల్ ఐమ్యాక్స్ లో తెల్లవారుజామున 3.20 కే షో వేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయట. బుక్ మై షో ద్వారా ఒక్క రోజులో మిలియన్ టికెట్లు అమ్మిన రికార్డు కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ సొంతం చేసుకుంది
అధిక శాతం కేంద్రాల్లో ఐమ్యాక్స్ 4డిఎక్స్ స్క్రీన్లలో అర్ధరాత్రి షోలు వేసుకునేందుకు ప్రత్యేక అనుమతి లభించినట్టు ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో హోరెత్తిపోతోంది. వాటికి సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఇవాళ చేయబోతున్నారు. సెకనుకు 18 టికెట్లు బుక్కవుతున్న అరుదైన ట్రెండ్ కు అవెంజర్స్ ఎండ్ గేమ్ సాక్ష్యంగా నిలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోలకు రాని క్రేజ్ దీనికి కనిపిస్తోందని ట్రేడ్ అనలిస్టులు నోరెళ్ళబెడుతుండటం విశేషం. దెబ్బకు పది రోజులు తిరక్కుండానే మల్టీ స్టారర్ కళంక్ వాష్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. మొత్తానికి ఇండియన్ సూపర్ స్టార్స్ కు మాత్రమే సాధ్యమయ్యే మిడ్ నైట్ షోలను వేసుకుని అవెంజర్స్ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఇక విడుదల అయ్యాక ఎన్ని రికార్డులు సొంతం అవుతాయో అంతు చిక్కడం లేదు