Begin typing your search above and press return to search.
`గూఢచారి 2` ఆలస్యానికి కారణం చెప్పిన శేష్
By: Tupaki Desk | 18 July 2021 4:35 AM GMTటాలీవుడ్ లో ఆల్ రౌండర్ ప్రతిభతో సత్తా చాటుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అడివి శేష్. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ `మేజర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ గూఢచారి సీక్వెల్ లో శేష్ నటించనున్నారు. నిజానికి గూఢచారి 2 తొలుత ప్రారంభం కావాల్సి ఉన్నా ఎందుకని ఆలస్యమైంది? అంటే దానికి శేష్ నుంచి సమాధానం వచ్చింది.
నిజానికి గూఢచారి 2 ని ప్రారంభించాలని అనుకున్నా కానీ ఈలోగానే మేజర్.. హిట్ సీక్వెల్ లో అవకాశాలొచ్చాయి. ముందుగా మేజర్ ని ప్రారంభించాల్సి వచ్చింది. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఇక మేజర్ చిత్రీకరణ పూర్తవ్వగానే హిట్ 2 ఆ తర్వాత గూఢచారి 2ని ప్రారంభించాల్సి ఉంది. కానీ మేజర్ ప్రారంభమయ్యాక వరుసగా కరోనా మహమ్మారీ వెంటాడుతోంది. దీనివల్ల ప్రాజెక్ట్ లన్నీ అంతకంతకు ఆలస్యమవుతున్నాయి. మేజర్ చిత్రీకరణ పూర్తవ్వగానే హిట్ 2.. లో నటించాలి. అలాగే గూఢచారి 2 స్క్రిప్టు పనులపై దృష్టి సారిస్తానని అన్నారు.
అమీతుమీ తరహా ప్రేమకథలో నటిస్తారా? అన్నదానికి.. అమీతుమీ కామెడీతో సరదాగా సాగే సినిమా. మధ్యలో ప్రేమకథ నడుస్తుంది. కానీ నేను బిగ్ బి షోలే తరహా ప్రేమకథలో నటించాలనుకుంటాను. అందాజ్ .. ఆప్నా ఆప్నా లాంటి ప్రేమకథల్లో నటించడం ఇష్టమని అన్నారు.
మేజర్ కథాకమామీషు:
అడివి శేష్ నటిస్తున్న `మేజర్` ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితకథతో తెరకెక్కుతోంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను ఆవిష్కరిస్తారు.
సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్రధాన తారాగణం. శశికిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు. శేష్ కి హిందీ డెబ్యూ చిత్రంగా రిలీజ్ కానుంది. మేజర్ ను జూలై 2 న హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల చేయాలని భావించినా.. సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథలో నటించే క్రమంలో అతడి జీవితంపై శేష్ విస్తృతమైన పరిశోధనలు చేశాడు. అతను సినిమా చేయడానికి సందీప్ తల్లిదండ్రుల నుండి అనుమతి కోరాడు. ఈ చిత్రం కోసం వారి ఇన్ పుట్స్ ని కూడా తీసుకున్నాడు. అయితే సందీప్ తల్లిదండ్రులు మొదట్లో విముఖత చూపినా శేష్ ఒప్పించారు. సందీప్ తల్లి పుట్టినరోజున ట్విట్టర్ లో శేష్ తమకు సహకరించిన వారి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందించారని తెలిపారు. మేజర్ చిత్రంతో శేష్ కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడితే ఆ తర్వాత అతడు నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా కేటగిరీలో ఇరుగు పొరుగు భాషల్లోనూ మార్కెట్ ని కొల్లగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇక శేష్ స్వతహాగా రచయిత. యూనివర్శల్ కాన్సెప్టులను ఎంపిక చేయడంలో అతడి ప్రత్యేకత ప్రూవ్ అయ్యింది.