Begin typing your search above and press return to search.

అవికా బికినీ ట్రీట్ మ‌రోసారి నెట్టింట ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   27 July 2022 12:30 PM GMT
అవికా బికినీ  ట్రీట్ మ‌రోసారి నెట్టింట ర‌చ్చ‌!
X
'ఉయ్యాలా జంపాల' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆరంభమే విజయం అందుకుంది. కానీ ఆ తర్వాత ఫ్లాపుల వల్ల హీరోయిన్ గా కెరీర్ అంత సాఫీగా సాగలేదు. తొలి సినిమాతో మంచి పెర్పార్మర్ గా నిరూపించుకున్నా అటుపై వచ్చిన అవకాశాలేవి బంగారు బాట వేయలేకపోయాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం..ఆన్ స్క్రీన్ పై మసాలా సన్నివేశాలకు నో చెప్పడం వంటి కారణాలతో అమ్మడిని దర్శక నిర్మాతలు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. దీంతో ఇటీవల అవిక లో ఊహించని మార్పులు తెలిసినదే.

కొన్ని నెల‌లుగా సరిహద్దులు చేరిపేసి తనలోని గ్లామర్ యాంగిల్ ని త‌ట్టిలేపుతుంది. బికినీ అందాల ఆరబోత‌లో వైవిథ్య‌త‌ని చాటుతుంది.బాలీవుడ్ హాట్ బ్యూటీల త‌ర‌హాలో మాల్దీవుల వేదిక‌గా మంట‌లు షురూ చేస్తుంది. ఆ మ‌ధ్య టాప్ లో డార్క్ గ్రీన్..బాటమ్ లో వైట్ కలర్ కాంబినేషన్ టూపీస్ దుస్తుల్ని ధరించి కుర్రాళ్ల‌లో అగ్గిరాజేసింది.

బీచ్ సైడ్ కాలు మీద కాలేసుకుని కాక‌లు పుట్టించింది. నిన్న మొన్నటివరకూ సంప్రదాయ పద్దతిలో వస్త్రాలు ధరించిన బ్యూటీ ఏకంగా బికినీలో దర్శనమివ్వడంతో కామెంట్రీ బాక్స్ ఒక్క‌సారిగా హీటెక్కింది. తాజాగా అమ్మ డు మ‌రోసారి మాల్దీవుల వెకేష‌న్ ఫోటోల్ని నెట్టింట వ‌దిలింది. ఆరెంజ్ అండ్ వైట్ క‌ల‌ర్ డిజైన్ టూపీస్ లో తుఫాన్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఈ పీస్ లో అమ్మ‌డి అందాలు ఆద్యంతం ఆక‌ట్ట‌కుంటున్నాయి. వాటితో పాటు మరికొన్ని హాట్ ఫోటోల్ని షేర్ చేసింది. వైట్ క‌ల‌ర్ ప్లోర‌ల్ లో సాయంసంధ్యావేళ బీచ్ అందాల్ని ఆస్వాదిస్తోంది.

అదే ఫోజులో మ‌ల్టీక‌ల‌ర్ డ్రెస్ లో దుమారం అదే తీరున హైలైట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అవికా అభిమానులు హాట్ కామెంట్ల‌తో హీట్ పెంచుతున్నారు.

ఇక అవికాగోర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే రిలీజ్ అయిన 'థాంక్యూ' లో సెకెండ్ లీడ్ పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అవికా చాలా ఆశ‌లే పెట్ట‌కుంది. కానీ అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అంత‌కు ముందు టెన్త్ క్లాస్ డైరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా ఫ‌లితం నిరాశ‌నే మిగిల్చింది. ప్ర‌స్తుతం ట‌ర్కీ ఖ‌జ‌క్ భాష‌లో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్ లో 1920 అనే సినిమాలోనూ న‌టిస్తోంది.