Begin typing your search above and press return to search.

చదువు కోసం సినిమాలకు గుడ్ బై?

By:  Tupaki Desk   |   3 April 2016 9:30 AM GMT
చదువు కోసం సినిమాలకు గుడ్ బై?
X
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో ‘ఆనంది’ క్యారెక్టర్ ను పోషించిన ఇద్దరూ వార్తల్లోకి వచ్చారు. మూడు రోజుల క్రితం ఆనంది యంగ్ ఏజ్ క్యారెక్టర్ పోసించిన ప్రత్యూష సూసైడ్ చేసుకోవటం షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదే పాత్రను చిన్నతనంలో చేసిన టీనేజర్ అవికా గోవికర్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ క్రేజ్ తో తెలుగులో సినిమాలు చేసిన అవికా.. ఇకపై సినిమాకు నో చెప్పనున్నట్లు చెప్పేసింది.

సినిమాలే కాదు.. టోటల్ గా యాక్టింగ్ కే కామా పెట్టిననట్లుగా ఆమె వెల్లడించింది. ఎందుకింత షాకింగ్ నిర్ణయం అంటే.. తానిప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నానని.. అందుకే యాక్టింగ్ కు కామా పెట్టినట్లు తేల్చేసింది. యాక్టింగ్ కెరీర్ మాంచి జోరు మీదున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఏమిటంటే.. యాక్టింగ్ తాను పూర్తిగా మానేయలేదని.. తన చదువు పూర్తి కాగానే మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెబుతోంది. ఇక.. ఆనంది సీనియర్ క్యారెక్టర్ ను పోషించి.. సూసైడ్ చేసుకున్న ప్రత్యూష గురించి మాట్లాడుతూ.. తను ఎప్పుడూ బాధ పడటం అన్నది తాను చూడలేదని చెప్పుకొచ్చింది. మొత్తానికి బొద్దుగుమ్మను కొన్నాళ్లు సిల్వర్ స్ర్కీన్ మీద చూడలేమన్న మాట.