Begin typing your search above and press return to search.

డైరక్టర్‌ తో అంకుల్‌ రెడీ అనేసిందట

By:  Tupaki Desk   |   24 Nov 2015 5:30 PM GMT
డైరక్టర్‌ తో అంకుల్‌ రెడీ అనేసిందట
X
చాలామంది హీరోయిన్లు ఎప్పుడూ దర్శకులను సార్‌ సార్‌ సాంబార్‌ అనే పిలుస్తారు. డైరక్టర్‌ వయస్సు ఎంతైనా కూడా సార్‌ అని పిలవడమే ఇక్కడ ఆనవాయితీ. దానిదేముందిలే.. చాలామంది దర్శకుల కంటే తమను సార్‌ అని పిలిచే హీరోయిన్ల రెమ్యూనరేషన్లే ఎక్కువ. ఇకపోతే ఇప్పుడు టాపిక్‌ మన క్యూట్‌ బేబీ అవికా గోర్‌ గురించే.

అమ్మడు ప్రస్తుతం 'తను నేను' అనే సినిమాతో విచ్చేస్తోంది. నిజానికి ఉయ్యాలా జంపాలా సినిమాతో వచ్చిన పేరు ఆ తరువాత అవికకు ఏ సినిమా చేసినా రాలేదు. లక్ష్మీ రావే మా ఇంటికీ - సినిమా చూపిస్తా మావా వంటి సినిమాల్లో ఈమె రోల్‌ అంతగా క్లిక్కవ్వలేదనే సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు తనను ఇంట్రొడ్యూస్‌ చేసిన ప్రొడ్యూసర్‌ రామ్మోహన్‌.. డైరక్టర్‌ గా మారి.. తనూ నేను.. సినిమాను తీశారు. ఈ సినిమా కథను చెప్పడానికి అవికా గోర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు.. ''అంకుల్‌ మీరు ఏ కథ అయినా చెప్పండి.. మీ సినిమా అంటే నేను రెడీ'' అనేసిందట అమ్మడు. వాటే కాన్షిడన్స్‌.

ఏదేమైనా ఈ సినిమా హిట్టయ్యిందంటే మాత్రం.. అవిక కెరీర్‌ మరోసారి గాట్టిగా టేకాఫ్‌ అవుతుంది.