Begin typing your search above and press return to search.

మరీ ఇంత చబ్బీ అంటే కష్టం పాపా

By:  Tupaki Desk   |   15 Aug 2015 7:53 PM GMT
మరీ ఇంత చబ్బీ అంటే కష్టం పాపా
X
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్లో ముఖ్య పాత్ర పోషించి... చిన్న తనంలోనే దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించేసింది అవికా గోర్. గోరుముద్దలు తినే వయసు నుంచే నటన వంట బట్టేసింది కాబట్టి.. ఉయ్యాల జంపాలలో ఆ అమ్మాయి అంత చక్కగా నటించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. నటనతో పాటు తన క్యూట్ నెస్ కూడా జనాలకు బాగా నచ్చింది. ఐతే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైతే ఓకే కానీ.. గ్లామర్ రోల్స్ చేయలేదేమో అని అప్పుడే సందేహాలు మొదలైపోయాయి. ఈ అమ్మాయి అసలు హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందా అని చాలామందికి డౌటొచ్చింది. దీనికి తోడు తన రెండో సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఫ్లాపై అమ్మాయిని నేలమీదికి తెచ్చేసింది.

ఇలాంటి సమయంలో ‘సినిమా చూపిస్త మావ’ మీద భారీ ఆశలే పెట్టుకుంది అవికా. ఆమె ఆశలకు తగ్గట్లే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఏం లాభం.. సినిమా హిట్టయ్యేలా ఉన్నా.. అమ్మడి గురించి వినిపిస్తున్న కామెంట్సే దారుణంగా ఉన్నాయి. అసలే హీరోయిన్ ఫీచర్లు తక్కువ, పైగా బాగా లావైపోయి చబ్బీగా తయారైంది. పైగా క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో నటన పరంగానూ ముద్ర వేయడానికి అవకాశం లేకుండా పోయింది అవికాకు. ఓ పక్క రాజ్ తరుణ్ తన ఛార్మ్ తో చెలరేగిపోతుంటే.. అవికా ఉత్సవ విగ్రహంలా నిలబడిపోయింది. అవికా కంటే రాజ్ పెద్దవాడైనా అతనే లేతగా కనిపించాడు. అతడి పక్కన లావెక్కిన అవికా ఎబ్బెట్టుగా కనిపించింది. తొలి సినిమాలోలాగా వీళ్లిద్దరి మధ్య ఇందులో కెమిస్ట్రీ పండలేదు. అసలే అమ్మడు హీరోయిన్ గా అది కూడా సింగిల్ హీరోయిన్ వేషాలు తప్ప ఇంకేమీ చేయనని అంటోంది. అంత బెట్టు చేస్తూ ఫిజిక్ ను ఇలా వదిలేస్తే ఎలా పాపా?