Begin typing your search above and press return to search.
గదిలోకి ఎంటరైన ఉయ్యాల సుందరి
By: Tupaki Desk | 8 July 2019 4:19 AM GMTకేవలం పది రోజుల క్రితం తమన్నా లీడ్ రోల్ లో యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 3ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఏమయ్యిందో కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే తమన్నా అందులో నుంచి బయటికి వచ్చేసింది. ముందు చెప్పిన కథను మార్చారని తన ప్రాధాన్యం తగ్గిందని అందుకే మిల్కీ బ్యూటీ వదిలేసుకుందని ఫిలిం నగర్ టాక్ ఉంది. నిజానికి యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా తెరవెనుక ఇతర హీరోయిన్లతో చర్చలు జరిపిన మాట వాస్తవం.
కాజల్ అగర్వాల్-తాప్సీలను ట్రై చేస్తే ఇద్దరూ డేట్లు లేవనే ఒకే కారణంతో నో చెప్పారట. కాల్ షీట్స్ తక్కువగా ఇచ్చినా చాలని చెప్పినా అంగీకరించలేదని వినికిడి. ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఆఫర్ కాస్తా అవికా గోర్ కు వెళ్లిందని ఫ్రెష్ అప్ డేట్. రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాల జంపాలతో డెబ్యూ చేసి ఆ తర్వాత సినిమా చూపిస్త మావా-ఎక్కడికి పోతావు చిన్నవాడతో మంచి హిట్లు దక్కించుకున్న అవికా గోర్ ఆ తర్వాత అదే సక్సెస్ ని కొనసాగించలేకపోయింది. దెబ్బకు మూడేళ్ళ నుంచి టాలీవుడ్ లో ఈ భామ కనిపించనే లేదు..
తరచుగా హైదరాబాద్ వచ్చి పోతున్నా కారణాలు మాత్రం తెలియలేదు. అదంతా పక్కన పెడితే ఇప్పుడీ రాజు గారి గది 3 బ్రాండ్ ని మోసేంత ఇమేజ్ అవికాకు ఉందా అనేదే ప్రశ్న. రెండో భాగానికి సమంతా పెద్ద ప్లస్ పాయింట్ కాగా నాగార్జున తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. అవికా గోర్ కు అంత సీన్ లేదు. పైగా ప్రేక్షకులు తనను మర్చిపోయారు. ఈ నేపథ్యంలో రాజు గారి గది 3 లాంటి బరువైన పాత్రను మోయడం అంత సులభమైతే కాదు.