Begin typing your search above and press return to search.

రేటు పెంచాలా? సినిమాలో ఏం చేసిందని?

By:  Tupaki Desk   |   27 Aug 2015 10:55 PM GMT
రేటు పెంచాలా? సినిమాలో ఏం చేసిందని?
X
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అవికాగోర్‌. క్యూట్‌ లుక్స్‌ తో, చక్కని అభినయంతో ఆకట్టుకుంది. ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయికగా తొలి అడుగులు వేసింది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించేసింది. లేటెస్టుగా 'సినిమా చూపిస్త మావ' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. చక్కని కామెడీ ఎంటర్‌ టైనర్‌ ఇది. అవికా, రాజ్‌ తరుణ్‌ జోడీ మరోసారి ఈ చిత్రంతో రిపీటైంది.

అయితే సినిమా సినిమాకి ఎదుగుదల కావాలి. మార్కెట్‌ లో నా విలువెంతో నాకు తెలియదు. నా మొదటి సినిమా ఉయ్యాల జంపాలకు నాకు ఇచ్చింది 5లక్షలు. అదో చీటింగ్‌. నా రేంజుకు తగ్గ పారితోషికం కాదు అది. అప్పుడు తెలియక ఒప్పేసుకున్నా.. అంటూ ఫోజుకొడుతోందిప్పుడు. ఈసారి నా పారితోషికం ఐదు రెట్లు పెంచేస్తున్నా. అంత పెద్ద మొత్తం ముట్టనిదే ప్రాజెక్టు ఓకే చేయనని చెప్పింది.

అయినా ఈ అమ్మడు సినిమాలో చేసింది ఏమిటి? ఇలియానాలా, త్రిషలా స్టార్‌ స్టాటస్‌ అప్పుడే వచ్చేసినట్టే ఫీలవుతోందా? అంటూ విసుర్లు వేస్తున్నారంతా. ప్రారంభం హీరోయిన్‌ గా ఛాన్సివ్వడమే నిర్మాత గొప్పతనం. తిరిగి ఛాన్స్‌ ఇచ్చినవారినే తిరిగి ఇలా నిందించడం వర్ధమాన తారకు కరెక్ట్‌ కాదేమోనని విమర్శిస్తున్నారంతా. అవిక ఏం సమాధానం చెబుతుందో?