Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే కానీ

By:  Tupaki Desk   |   26 April 2021 11:53 AM GMT
ఫోటో స్టోరి: చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే కానీ
X
చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమై ఉయ్యాల జంపాల చిత్రంతో క‌థానాయిక‌గా టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన అవికాగోర్ కెరీర్ ర‌న్ గురించి తెలిసిందే. తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌-మ‌ల‌యాళం- హిందీలో వ‌రుస‌గా సినిమాలు చేసింది. హిందీ బుల్లితెర‌పై ఇప్ప‌టికీ త‌న‌కు మంచి గుర్తింపు ఉంది.

బాలనటిగా పరిచయమైన ఈ బ్యూటీ క‌థానాయిక‌గా పెద్ద స్థాయికి ఎదిగేస్తుంద‌నే భావించారంతా. కానీ తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా అయ్యింది. తెలుగు సినీపరిశ్ర‌మ‌లో ఆరంభం చ‌క‌చ‌కా అవ‌కాశాలు అందుకున్నా కానీ ఆశించిన రేంజుకు చేర‌లేక చ‌తికిల‌బ‌డింది. ఆ మ‌ధ్య‌లోనే త‌న‌పై ఎవ‌రో కొంద‌రు కుట్ర‌లు చేశార‌ని ఆరోపించ‌డంతో అది కాస్తా టాలీవుడ్ లో హైలైట్ అయ్యింది.

ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తో మ‌ళ్లీ త‌న ప్ర‌య‌త్నాలు తాను మొద‌లు పెట్టింది. ఇటీవ‌ల రెగ్యుల‌ర్ గా జిమ్ యోగా అంటూ బ‌రువు త‌గ్గింది. అధిక బ‌రువుతో తాను ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల్ని అభిమానుల‌కు ఏమాత్రం దాప‌రికం లేకుండా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇక గ‌తం గ‌తః. ఇప్పుడు అవికా ఎంతో స్లిమ్ గా మారిపోయింది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ లో ఆఫ‌ర్ కూడా అందుకుంది. మెగాస్టార్ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న ఓ సినిమాకి క‌మిటైన ఈ బ్యూటీ నాగ‌చైత‌న్య థాంక్యూలోనూ ఒక ఆస‌క్తిక‌ర పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. అయితే ఇటీవ‌ల మ‌రీ జీరో సైజ్ పిచ్చితో మ‌రీ త‌గ్గిపోతోంది. అవికా కాస్త ఓవ‌ర్ జిమ్ త‌గ్గించి గ్లామర్ యాంగిల్ లో గ్యాప్ ని ఫిల్ చేస్తేనే మంచిదేమో!! చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే కానీ.. జ‌రంత జాగ్ర‌త్త అనేస్తున్నారు.