Begin typing your search above and press return to search.

ఉయ్యాల పాప మరీ బెట్టు చేస్తోందే

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:24 PM GMT
ఉయ్యాల పాప మరీ బెట్టు చేస్తోందే
X
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగునాట సూపర్ పాపులరైపోయింది అవికా గోర్. ఆమె చలాకీ తనం చూసి కొత్త దర్శకుడు విరించి వర్మ ‘ఉయ్యాల జంపాల’లో అవకాశమిచ్చాడు. అమ్మాయి ఆహార్యానికి తగిన పాత్ర కావడంతో మంచి పేరే వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’లో సరైన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు ‘సినిమా చూపిస్త మావ’ సినిమాతో మరోసారి రాజ్ తరుణ్ తో జత కడుతోంది అవికా. ఐతే మూడు సినిమాల వయసుకే ఈ అమ్మాయి బాగా లావైపోయి.. అదోలా కనిపిస్తోంది. మామూలుగానే అమ్మాయిలో హీరోయిన్ ఫీచర్స్ తక్కువ. పైగా బొద్దుగా కూడా తయారైంది. ఇన్ని మైనస్ లున్న అమ్మాయి హీరోయిన్ వేషాలు తప్ప ఇంకేమీ వేసే ప్రసక్తే లేదని... ఇద్దరు ముగ్గరు హీరోయిన్లున్న సినిమా కూడా చేయనని బెట్టు చేస్తోంది.

కథానాయిక పాత్రలే చేస్తారా.. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీనా అని అడిగితే.. ‘‘లేదు. నాకు ఆ ఆలోచన లేదు. ఎందుకంటే ఎప్పుడూ నాకు కీలక పాత్రలే చేయాలని కోరిక. ఇంకా చెప్పాలంటే హీరో తరహా పాత్రలు చేయాలని ఉండేది. కానీ నాకా ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలు చేస్తుంటా. చెల్లి, మరదలు తరహా పాత్రల జోలికే వెళ్లను. ఈ మధ్యే మలయాళంలో ప్రేమమ్ అనే సినిమా వచ్చింది. అందులో ముగ్గురు హీరోయిన్స్. ఒక హీరో. అప్పుడు నన్ను చాలామంది అడిగారు.. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమా చేస్తావా అని. నాకెందుకో చేయాలనిపించదు’’ అని చెప్పింది అవికా. ప్రేమకథలకే పరిమితమా.. భిన్నమైన సినిమాలు చేస్తారా అని అడిగితే.. ‘‘ఇప్పుడు నన్ను ప్రేక్షకులు లవ్ స్టోరీల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఏదిష్టమో అదే చేయాలి. బోర్ కొట్టేంత వరకు ఇలాంటి సినిమాల్లోనే చేస్తా’’ అని చెప్పింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు కూడా చేయనని.. తనకు సెట్ కావని, హీరోయిన్ గా లీడ్ రోల్స్ చేస్తాను తప్పి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ మీద ఆసక్తి లేదని స్పష్టం చేసింది.