Begin typing your search above and press return to search.

కేన్స్ లో టాలీవుడ్ హీరోయిన్ సందడి

By:  Tupaki Desk   |   22 May 2016 11:30 AM GMT
కేన్స్ లో టాలీవుడ్ హీరోయిన్ సందడి
X
తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులతో పక్కింటమ్మాయి అనిపించుకుంది అవికా గోర్. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఇంటింటికీ పరిచయం అయిపోయిన అవిక.. ఆ తర్వాత వరుసగా కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తమిళ్, కన్నడలో కూడా నటిస్తున్నా.. తెలుగు సినిమా ఆఫర్లతో పోల్చితే.. వీటి కౌంట్ తక్కువే.

కాసింత బొద్దు భామగా ఉండే లుక్ నుంచి ఈ మధ్య క్యూట్ గాళ్ ఇమేజ్ వైపు టర్న్ అవుతోంది అవిక. అందుకు తగ్గట్లుగానే పర్సనాలిటీలో ఛేంజ్ చూపిస్తోంది. మరోవైపు.. పద్ధతిగా కనిపించే లంగాఓణీ డ్రస్సు నుంచి క్లీవేజ్ చూపించే గ్లామర్ గెటప్పుల వరకూ బాగానే ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫెస్టివల్ లో సందడి చేసింది అవిక.

టీవీ యాక్టర్ మనీష్ రైజింగానీతో కలిసి.. రెడ్ కార్పెట్ పై నడించిన అవిక.. 'జస్టే లా ఫిన్ డు' అనే ఓ ఫ్రెంచ్ ట్రైలర్ ను చూసేందుకు హాజరైంది. బ్లూ కలర్ డ్రెస్ లో వన్ సైడ్ స్లీవ్ తో అదరగొట్టేసింది అవిక. హెయిర్ స్టైల్ నుంచి మేకప్ వరకూ అన్ని డిఫరెంట్ గా ట్రై చేయడం విశేషం. కేన్స్ లో ఇప్పటివరకూ బాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ పై సందడి చేయడం చాలాసార్లే చూశాం కానీ.. ఇలా ఓ తెలుగు హీరోయిన్ ఇంత సందడి చేయడం విశేషమే.