Begin typing your search above and press return to search.
స్లిమ్ పెళ్లికూతురుకి ఛాన్స్ ఇచ్చేదెవరో
By: Tupaki Desk | 7 Jun 2016 1:54 PM GMTచిన్నారి పెళ్లికూతురుగా కనిపించి టాలీవుడ్ లో బాగానే పాగా వేసింది అవికా గోర్. మొదటి సినిమానే హిట్ కావడం, అమ్మడి యాక్టింగ్ కి మంచి పేరు రావడంతో.. వరుసగా ఛాన్సులు వచ్చేశాయి. రెండు - మూడు సినిమాలు అయిన తరువాత.. అసలు విషయం బైటపడింది. టాలీవుడ్ కి సంబంధించినంతవరకు అభినయంతో పాటు అందం కూడా ముఖ్యం. చూసేందుకు బొద్దుగా ఉన్న ఈ భామకు అవకాశాలు సన్నగిల్లాయి.
దీంతో సైజుల విషయంలో తగ్గించుకోక తప్పని పరిస్థితి అవికా గోర్ కి ఏర్పడింది. తనకు డిమాండ్ ఉన్నా.. ఛాన్సులిచ్చేందుకు దర్శక నిర్మాతలు వెనకాడే పరిస్థితి ఎందుకొచ్చిందో.. ఈ వయ్యారికి బాగానే అర్ధమైంది. కొలతల విషయంలో కచ్చితత్వాన్ని పాటించే టాలీవుడ్ కి.. తగినట్లుగా తయారయ్యేందుకు వర్కవుట్స్ స్టార్ట్ చేసేసింది. అనుకున్నదే తడవు.. తన బాడీని బాగానే మౌల్డ్ చేసిన అవికా గోర్.. మెల్లగా స్లిమ్ కోటాలోకి వచ్చేసింది. ఇదుగో ఇలా సెల్ఫీ దిగుతున్నట్లుగా పోజులుస్తూ.. తన నడుం అందాలను బయటపెడుతోంది అవిక.
ఇంకో మాట కూడా చెప్పుకోవాలండోయ్. మొదట ఈ భామని అందం చూపించమ్మా అని నిర్మాతలు అంటే.. అబ్బెబ్బే ఎక్స్ పోజింగ్ కి నాకు అసలు పడదని చెప్పేది. ఇప్పుడు అడక్కుండానే కొంచెం కొంచెం తన అందాలను బయటపెట్టేందుకు సిద్ధమైపోతోంది. మరి బాడీ సైజు తగ్గాక.. డ్రెస్సుల కొలతలు కూడా తగ్గాలి కదా. అదన్న మాట అవిక అందం సంగతులు. మరి ఇప్పుడైనా అవికా గోర్ కి ఛాన్సులిచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తారా!