Begin typing your search above and press return to search.
అవినాష్ కెప్టెన్సీలో కొత్త రూల్స్
By: Tupaki Desk | 23 Oct 2020 11:04 AM GMTబిగ్ బాస్ హౌస్ లో వారంకు ఒక కొత్త కెప్టెన్ వస్తూ ఉంటాడు. తెలుగు బిగ్ బాస్ లో ఈ వారం టాస్క్ లో అవినాష్ విజేతగా నిలిచి కొత్త కెప్టన్ అయ్యాడు. కెప్టెన్ అయిన అవినాష్ కు వచ్చే వారం ఇమ్యూనిటీ దక్కడంతో పాటు కొన్ని కీలక అధికారాలు వస్తాయి. దాంతో కెప్టెన్ గా అవినాష్ ఇంటి సభ్యులకు కొత్త రూల్స్ ను పెట్టాడు. మైక్ ధరింపజేయడం తెలుగులో మాట్లాడేలా చూసుకోవడం కెప్టెన్ బాధ్యత. ఎక్కువ సార్లు ఇంటి సభ్యులు ఆ నియమం పాటించకుంటే కెప్టెన్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే కెప్టెన్ లు ఎక్కువగా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అవినాష్ కూడా పనుల విషయం గురించి పెద్దగా ప్రస్థావించకుండా మైక్ ధరించడం మరియు తెలుగులో మాట్లాడటం వంటి విషయాలపై దృష్టి పెట్టాడు. కెప్టెన్ గా ఆయన ప్రత్యేక అధికారులు ఉపయోగించి బిగ్ బాస్ ఎవరైతే మైక్ ధరించలేదు అంటాడో వారు వంద సార్లు మైక్ ధరించనందుకు సారీ చెప్పాలంటూ ఆదేశించాడు. అదే సమయంలో ఇంగ్లీష్ లో మాట్లాడినా కూడా కఠినంగా శిక్ష ఉంటుందంటూ హెచ్చరించాడు. అవినాష్ కొత్త రూల్స్ పై బిగ్ బాస్ గారు కొత్త రూల్స్ పెడుతున్నారుగా అంటూ కాస్త ఎటకారంగా మాట్లాడింది. అవినాష్ కెప్టెన్ గా కాక ముందు దాదపు అందరితో చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆయన అందరికి మంచి అనిపించుకోవడంతో పాటు సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు.
ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత కొన్ని కొన్ని సార్లు గొడవల్లో తలదూర్చాల్సి వస్తుంది. అప్పుడు గొడవల్లో ఇరుక్కోవాల్సి రావచ్చు. కనుక అవినాష్ ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటాడేమో అని ఇన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న అవినాష్ ఇక బయటకు రావాల్సి వస్తుందేమో అంటున్నారు. ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ లో ఉన్నాడు. అయితే ఖచ్చితంగా సేవ్ అవుతాడని అంతా నమ్మకంగా ఉన్నారు.