Begin typing your search above and press return to search.

ఏవీఎం స్టూడియోస్‌ కి 20 ఎక‌రాలు?

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:59 AM GMT
ఏవీఎం స్టూడియోస్‌ కి 20 ఎక‌రాలు?
X
ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫిలిం స్టూడియోస్ విశాఖ ప‌ట్నం బీచ్‌ పై క‌న్నేశాయా? అక్క‌డ సినీ స్టూడియోల ఏర్పాటుకు మోజు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఆ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని చ‌ర్య‌లు ఆక‌ర్షిస్తున్నాయ‌న్న మాట వినిపిస్తోంది. స్థ‌లాల‌ ల‌బ్ధి కోసం ప‌లు స్టూడియోల ఓన‌ర్లు అక్క‌డ కొత్త స్టూడియోల సెట‌ప్ కోసం స్కెచ్ వేశార‌న్న‌ది ఫిలింస‌ర్కిల్స్‌ లో వినిపిస్తున్న మాట‌. వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో 316 ఎక‌రాలు కేవ‌లం స్టూడియోల నిర్మాణానికే కేటాయిస్తున్నామ‌ని, అందుకు జీవో వెలువ‌డ‌నుంద‌ని ఏపీఎఫ్‌ డీసీ అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ సీన్ పూర్తిగా మార‌నుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌ - ఏవీఎం స్టూడియోస్ య‌జ‌మానులు దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ పేర్ల‌తో పాటు ప‌లు జాతీయ‌ - అంత‌ర్జాతీయ సంస్థ‌ల భాగ‌స్వామ్యం ఇక్క‌డ స్టూడియోల ఏర్పాటున‌కు ఉంటుంద‌న్న స‌మాచారం అందుతోంది. ఆ మేర‌కు ఏపీ ఎఫ్‌ డీసీ కీల‌క స‌భ్యుడు అందించిన వివ‌రం తెలియ‌జేస్తోంది.

స్టూడియోల కోసం రుషి కొండ నుంచి కాపులుప్పాడ‌ - భీమిలి వ‌ర‌కూ స్థ‌లాల్ని కేటాయించ‌నున్నారు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ స్థాయిలో పేరున్న చెన్న‌య్‌ ఏవీఎం స్టూడియోస్ బీచ్ సొగ‌సుల విశాఖ‌లో ఒక భారీ స్టూడియోని ఏర్పాటు చేసేందుకు పావులు క‌దుపుతోంది. ఏవీఎం సంస్థ అంటే ప్ర‌పంచంలోనే పేరెన్నిక‌గ‌న్న దిగ్గ‌జ సంస్థ‌. 1945 నుంచి ఏవీఎం చ‌రిత్ర రికార్డుల్లో పొందుప‌రిచి ఉంది. 307 మిలియ‌న్ల అమెరిక‌న్ డాల‌ర్ల ఆస్తులు క‌లిగిన‌ ఈ సంస్థ‌ అసాధార‌ణ ట్రాక్ రికార్డ్ ప‌రిశీలిస్తే క‌ళ్లు చెద‌రాల్సిందే. నాడు మద్రాసులో ఈ స్టూడియోని 1945లో ఏవీ మేయ‌ప్ప‌న్ అనే ఆసామి ప్రారంభించారు. ఇందులో కొన్ని వంద‌ల సినిమాల‌కు సంబంధించిన పనులు నిరంత‌రం సాగుతుంటాయి.

ఏవీఎం స్టూడియోస్ సినీ నిర్మాణంలోనూ అగ్ర‌గామి సంస్థ‌. ఏవీఎం బ్యాన‌ర్‌ లో 170సినిమాలు తెర‌కెక్కాయి. 70 ఏళ్లుగా ఈ దిగ్గ‌జ సంస్థ సినీరంగంలో వేళ్లూనుకుని ఉంది. అందుకే ఈ సంస్థ వైజాగ్‌ లో భారీ స్కెచ్ వేసింద‌న్న మాట వినిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ద‌ర‌ఖాస్తులు ప‌రిశీలిస్తే తొలిగా చూడాల్సిన ద‌ర‌ఖాస్తునే. ఆ త‌ర్వాతే ఇంకెవ‌రికైనా స్టూడియో సెట‌ప్ ఫెసిలిటీస్ క‌ల్పించాల్సి ఉంటుంద‌న్న మాటా వినిపిస్తోంది.అందుకే ఏవీఎం సంస్థ‌కు 20-30 ఎక‌రాలు కేటాయించే ఆస్కారం ఉంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.