Begin typing your search above and press return to search.
సెకండ్ సింగిల్ : అవుననవా.. ఓ సోల్ ఫుల్ మెలోడీ!
By: Tupaki Desk | 27 Sep 2022 11:34 AM GMTయువ నటుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ఓరి దేవుడా'. ఇందేలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. తనకిది తెలుగులో తొలి మూవీ. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలోని కీలక పాత్రలో దేవుడిగా హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేసింది. అంత వరకు ఈ మూవీపై ఎలాంటి క్రేజ్ లేదు. విక్టరీ వెంకటేష్ ఇందులో గాడ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిన క్షణం నుంచి ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి నిలవడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ లిరికల్ వీడియోలని విడుదల చేయడం మొదలు పెట్టారు.
అక్టోబర్ 21న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం సెకండ్ సింగిల్ గా 'అవుననవా.. 'అంటూ సాగే పాటని విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. సిద్ శ్రీరామ్ గానం చేసిన ఈ సాంగ్ హృదయాంతరాల్లోకి చేరి ప్రేక్షకుల్ని జ్ఞాపకాలతో మై మరచిపోయేలా చేస్తోంది. సోల్ ఫుల్ మెలోడీగా సాగుతున్న ఈ పాట సినిమాకు మరింత బలంగా నిలవడం ఖాయం.
ఓ అందమైన ప్రేమ జంట యదలోతుల్లో దాగివున్న జ్ఞాపకాల ప్రయాణంగా ఈ పాట సాగింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి సిద్ శ్రీరామ్ అందించిన గాత్రం.. లియోన్ మేమ్స్ సంగీతం తోడై ఈ పాట సోల్ ఫుల్ మెలోడీగా భావోద్వేగ భరితంగా సాగడం విశేషం. ప్రేమలో వున్న ప్రతీ ఒక్కరినీ హంట్ చేసే విధంగా ఈ పాటని తీర్చి దిద్దిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆ జ్ఞాపకాల్లో విహరించేలా చేస్తుంది.
దీపావళి సందర్భంగా ఈ మూవీని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. విక్టరీ వెంటకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించిన ఈ మూవీకి ఎడిటింగ్ విజయ్. సినిమాటోగ్రఫీ విధు అయ్యన్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.