Begin typing your search above and press return to search.
‘మహానటి’పై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం
By: Tupaki Desk | 1 April 2020 9:50 AM GMTఅందం.. అభినయం ప్రదర్శించే కొద్దిమంది నటుమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. ‘నేను శైలజ’తో తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్ పరిచయమైంది. ఈ మూవీలో కీర్తి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’లో పాతతరం నటి సావిత్రిగా నటించి మెప్పించింది. కీర్తీ నటనకు జాతీయ అవార్డు వరించింది. ఈ మూవీ తర్వాత కీర్తికి తమిళ అవకాశాలు ఎక్కువగా వచ్చారు. దీంతో ‘మహానటి’ తర్వాత తెలుగుకు ప్రేక్షకులకు దూరమైంది. అయితే తాజాగా ‘మిస్ ఇండియా’ పాన్ ఇండియా మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ మూవీ తర్వాత మహేష్ తదుపరి మూవీపై ఆసక్తి నెలకొంది. ఇక మహేష్ బాబు ఈ మధ్యలో ‘ఆచార్య’ మూవీలో నటిస్తాడనే ప్రచారం జరిగింది. అదంతా పుకారేనని తేలడంతో మహేష్ తదుపరి మూవీలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పర్శురాంతో మహేష్ బాబు 27వ మూవీ ఉందనుందని తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే దీనిపై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరోలతో కీర్తి సురేష్ చేసిన మూవీలన్నీ ఫ్లాపులుగా మిగిలాయని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ధనుష్ తో కీర్తి నటించిన ‘తొడరి’ మూవీ, పవన్ కల్యాణ్ తో నటించిన ‘అజ్ఞాతవాసి’ ప్లాపులకు చూపిస్తున్నారు. అయితే తమిళ దళపతి విజయ్-కీర్తీ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ మాత్రం ఘన విజయం సాధించింది. కీర్తి పక్కన స్టార్ హీరోలు నటిస్తే ఆ మూవీ ప్లాప్ అవుతుందనే నెగిటివ్ సెంటిమెంట్ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే మహేష్ బాబు తన పక్కన ‘మహానటి’కి ఛాన్స్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే.