Begin typing your search above and press return to search.
అర మిలియన్ లాగేసిన అ!
By: Tupaki Desk | 19 Feb 2018 5:35 AM GMTటాలీవుడ్ లో అతి అరుదుగా జరిగే ప్రయోగాల్లో వినూత్నంగా ఉందనే పేరు తెచ్చుకున్న అ! మూవీ ఇక్కడ కొంత డివైడ్ టాక్ తో రన్ అవుతున్నప్పటికీ అమెరికాలో మాత్రం అదరగొడుతోంది. ఇందులో ఉన్న యునీక్ కాన్సెప్ట్ అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో కాసులు కురిపించేస్తున్నారు. నిన్నటితో మూడు రోజుల రన్ పూర్తి చేసుకున్న అ! విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి దాకా 5 లక్షల 15 వేల డాలర్లు రాబట్టి మూడు రోజుల్లోనే అర మిలియన్ మార్క్ దాటేసి ఇంకాస్త స్పీడ్ తో శుక్రవారం నుంచి అదనపు స్క్రీన్లు జోడించుకుంటోంది. హీరో లేకుండా కేవలం నలుగురు హీరొయిన్లతో గతంలో వాళ్ళు చేయని కొత్త తరహా పాత్రలతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన అ! జోరు ఇలాగే కొనసాగితే మిలియన్ మార్క్ అందుకోవడం కూడా ఆశ్చర్యమేమీ కాదు.
నాని నిర్మాతగా మారి సినిమాను నిర్మించడం ఒక ప్లస్ కాగా కాజల్, నిత్య మీనన్, రెజినా, ఈశా రెబ్బ లాంటి పేరున్న కథానాయికలు ఇలాంటి మూవీ కోసం టీంగా మారడం వసూళ్ళకు బాగా దోహదపడుతోంది. ఓవర్సీస్ లో తొలిప్రేమ తర్వాత అంత స్థాయిలో చెప్పుకోదగ్గ తెలుగు సినిమా ఏది రాలేదు. దీంతో అ! ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటోంది. పోటీ అనుకున్న రచయిత - హింది సినిమా అయారి రెండు కూడా నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకోవడం కూడా కలిసి వస్తోంది.
ఇక ఇక్కడ కూడా డీసెంట్ గా రన్ అవుతున్న అ! కు సంబంధించిన పూర్తి కలెక్షన్ రిపోర్ట్ ఇంకా ట్రేడ్ నుంచి అందాల్సి ఉంది. అన్ని వర్గాలను మెప్పించే సినిమా కాదనే ఇది తీసామని చెబుతున్న నిర్మాత నాని - దర్శకుడు ప్రశాంత్ వర్మ వారు కోరుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అవుతున్నారనే చెప్పొచ్చు. రిజల్ట్ పట్ల ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మిశ్రమ స్పందన సైతం ఈ వారంలో పూర్తి సానుకూలంగా మారుతుంది అనే నమ్మకంతో ఉన్నారు.